వింత పాల‌న – వింత‌ముఖ్య‌మంత్రి…

అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో అవినీతి పాల‌న జ‌రుగుతుందని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. రాష్ట్రంలో నెల‌కొన్న ప‌రిస్థితుల గురించి ముఖ్య‌మంత్రి స్వ‌యంగా వెళ్లి ప్ర‌జ‌లకు ఉన్న స‌మ‌స్య‌ల‌ను తెలుసుకొని వారి స‌హాయం చేయాల‌న్నారు. ఆదివారం ఆయ‌న ఇక్క‌డ మీడియాతో మాట్లాడుతూ కనీసం ఆ ప్రాంతాల ఎమ్మెల్యేల ద‌గ్గ‌ర నుండి అయినా స‌మాచారం తీసుకోవాల‌న్నారు. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌వారిని మాట్లాడ‌నివ్వ‌ర‌ని, క‌ల‌వ‌డానికి సీఎం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వ‌ర‌ని ఇదొక వింత స‌ర్కారు . వింతైన ముఖ్య‌మంత్రి అని ఆయ‌న హెద్దేవా చేశారు. ప్ర‌భుత్వాన్ని అస్థిర‌ప‌రిచేవిధంగా ఎంపీ రాఘురామ వ్యాఖ్య‌లు ఉన్నాయని ఓమీడియా అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానంగా విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ.. న్యాయ‌వ్య‌వ‌స్థ‌ను అస్థిర‌ప‌ర్చ‌డానికి వైసీపీ సోష‌ల్ మీడియాలో న్యాయ‌మూర్తుల‌ను ముక్క‌లు ముక్క‌లుగా న‌రికేయాల‌ని చెప్పిన‌ప్పుడు అది అస్థిర‌ప‌ర్చ‌డం కాదా;? అని అన్నారు. అలాగే జ‌గ‌న్ ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న‌ప్పుడు అప్ప‌టి సీఎం చంద్ర‌బాబుపై నంద్యాల‌లో ఆయ‌న చేసిన వ్యాఖ్యాలు ప్ర‌భుత్వాన్ని అస్థిర‌ప‌ర్చ‌డం కాదా? అని ప్ర‌శ్నించారు. దానికంటే రాఘురామ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్య‌లు ఎక్కువా? అని నిల‌దీశారు. ఒక డిక్టేట‌ర్ షిప్‌గా రాష్ట్రంలో పాల‌న జ‌రుగుతోంద‌ని విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై మాట్లాడితే వారిపై కేసులు పెట్టి, అరెస్టులు చేయించ‌డం స‌రికాద‌ని ఆయ‌న అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *