ఏపీరాష్ట్రంలో గ‌త 24గంట‌ల్లో 10,373 క‌రోనా కేసులు న‌మోదు…..

అమ‌రావ‌తి: దేశంలో ఎక్క‌డ చూసిన క‌రోనా మ‌హ‌మ్మారి విజృభిస్తున్న‌సంగ‌తి తెలిసిందే. రాష్ట్రంలో గ‌త 24గంట‌ల్లో 10,373 మందికి క‌రోనా సోకింది. రాష్ట్ర వ్యాప్తంగా శుక్ర‌వారం 88,441 శాంపిల్స్ ను ప‌రీక్షించామ‌ని దీంతో ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్రంలో నిర్వ‌హించిన కొవిడ్ ప‌రీక్ష‌ల సంఖ్య 1,97,08,031 కి చేరిందని తెలిపింది. క‌రోనా వ‌ల్ల గ‌డిచిన 24గంట‌ల్లో 80 మంది మ‌ర‌ణించారు. ఇంత‌కు వ‌ర‌కు మ‌ర‌ణించిన వారి సంఖ్య 11,376 కి చేరింది. రాష్ట్రంలో గ‌డిచిన 24గంట‌ల్లోల‌15,958 మంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పుడు 1,28,108 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో కోటి ఆరుల‌క్ష‌ల మందికి రెండు డోసుల వ్యాక్సిన్ వేశామ‌ని, 45సంవ‌త్స‌రాల‌దాటిన వారిలో 50 శాతం మందికి మొద‌టి డోసు వేశామ‌ని వైద్య ఆరోగ్య‌శాఖ ముఖ్య‌కార్య‌ద‌ర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *