కృష్ట‌ప‌ట్నం ఆయుర్వేదం పై చంద్ర‌బాబు కీల‌క వ్యాఖ్యాలు….

అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ప్ర‌జ‌ల‌కు ర‌క్ష‌ణ లేద‌ని, టీడీపీ అధినేత రాచంద్ర‌బాబునాయుడు పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా వాసి అయిన ఆయుర్వేద వైద్యుడు ఆనంద‌య్య‌ను అధికార పార్టీ చెందిన నాయ‌కులు బెదిరించారు. ఆయుర్వేద మందు పై అధ్య‌యం చేయాల‌ని కానీ వెంట‌నే ఆయుర్వేద మందును నిలిపివేయాల‌ని ఆదేశించారు. వైసీపీ ఎమ్మేల్యే పిలుపుతో కృష్ణ ప‌ట్నంలో గుమిగూడార‌న్నారు. ఏపీలో క‌రోనా రోగం విజృభిస్తూ త‌రుణంలో ఇలా అధికార పార్టీ నాయ‌కులు చేస్తున్న తీరును దుయ్య‌బ‌ట్టారు. దావ‌ఖాలో ఆక్సిజ‌న్ లేక ప్ర‌జ‌లు చ‌నిపోతున్నార‌ని బాధ‌ప‌డ్డారు. ప్ర‌జ‌లను ప‌ట్టించుకోకుండా క‌క్ష సాధింపు ప‌నులు చేయ‌డం ఎంతో వ‌ర‌కు న్యాయ‌మ‌ని మండిప‌డ్డారు. మాస్క్ అడిగిన పాపానికి డాక్ట‌ర్ సుధాక‌ర్ వేధించి చంపేశార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌జ‌ల‌ను కాపాడే కుర్చీలో ఉన్న వాడు ఇలా చేయ‌డం ఎంతో వ‌ర‌కు స‌మ‌జ‌సం అన్ని అన్నారు. అడిగితే ఎదురు దాడుల‌కు పాల్ప‌డుతున్నార‌ని చంద్ర‌బాబు వాపోయారు. అస‌లు రాష్ట్రంలో ప్ర‌భుత్వ పాల‌న జ‌రుగుతుందా? లేదా అని మండిప‌డ్డారు. నింబ‌ధనలు ఉల్లంఘించిన అన్ని అంశాల‌పై కోర్టుల్లో వైసీపీ ప్ర‌భుత్వానికి ఎదురుదెబ్బ‌లు త‌గిలాయ‌ని అన్నారు. తాజా ఎస్ఈసీని తీసుకువ‌చ్చి ఆగ‌ఘోల పోలీంగ్ నిర్వ‌హించార‌ని చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించ‌కుండా ఎన్నిక‌ల‌ను జ‌రిపార‌న్నారు.నామినేష‌న్లు స‌రిగా ఉన్న‌వాళ్ల‌ని కూడా తిర‌స్క‌రించార‌ని చంద్ర‌బాబు త‌ప్పుబ‌ట్టారు. సీఎం జ‌గ‌న్ అహంభావంతో ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేశార‌న్నారు. కోర్టుల ఆదేశాల‌ను అమ‌లు చేయాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వంపై లేదా అని చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు. మీ ఇష్ట‌మొచ్చిన‌ట్లు చేసేందుకైన రాజ్యాంగం ఉన్న‌ది అని చంద్ర‌బాబు నిల‌దీశారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యంగం కాదు. అంబేద్క‌ర్ రాజ్యంగం అమ‌లు చేయాల‌ని డిమాండ్ చేశారు. వైసీపీ న‌ర్సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ రాజుపై దేశ ద్రోహం కేసు పెట్టార‌ని ధ్వ‌జ‌మెత్తారు. గ‌తంలో జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌లు దేశ ద్రోహం కింద‌కు రావా? అని ప్ర‌శ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *