విద్యార్థుల జీవితాల‌ను బ‌లిపీఠం ఎక్కిస్తారా – అగ‌గాని స‌త్య‌ప్ర‌సాద్‌

అమ‌రావ‌తి: ఏపీరాష్ట్రంలో క‌రోనా క‌ర‌ళానృత్యం చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇలాంటి త‌రుణంలో టెన్త్‌, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ జ‌గ‌న్ స‌ర్కారు మూర్ఖ‌త్వ‌మే నిద‌ర్శ‌న‌మ‌ని టీడీపీ శాస‌న‌స‌భ్యులు అగ‌గాని స‌త్య‌ప్ర‌సాద్ విమ‌ర్శించారు.నేడు మీడియాతో ముచ్చ‌టిస్తూ.. విద్యార్థులే ప‌రీక్ష‌లు వ‌ద్దంటుంటే నిర్వ‌హించ‌డానికి జ‌గ‌న్ రెడ్డి ఎవ‌రు అని ప్ర‌శ్నించారు. దేశంలోని దాదాపు16 రాష్ట్రాల‌తో పాటు ఐసీఎస్ఈ, సీబీఎస్ ఈ బోర్డులు ప‌రీక్ష‌లు ర‌ద్దు చేస్తే ఏపీరాష్ట్రంలో ఎందుకు రివ‌ర్స్ నిర్ణ‌యాలు చేస్తున్నార‌ని ఆరోపించారు. రాష్ట్రంలో క‌రోనా మూడో ద‌శ‌కు జ‌గ‌న్‌, మంత్రి సురేష్‌లు తెర‌తీసే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని ఆరోపించారు. తిరుప‌తి ఉప ఎన్నిక ప్ర‌చారానికి వ‌స్తే కొవిడ్ పెరుగుతుంద‌ని రాకుండా ఉన్న సీఎం, విద్యార్థుల జీవితాల‌ను బ‌లిపీఠం ఎక్కిస్తారా? విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా టెన్త్‌, ఇంట‌ర్ ప‌రీక్ష‌లు ర‌ద్దు చేసి పై త‌ర‌గ‌తుల‌కు ప్ర‌మోట్ చేయాల‌ని అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్ డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *