ఏపీలో బుధ‌వారం నుండి క‌ర్ప్యూ ..

అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్రదేశ్ రాష్ట్రంలో కొవిడ్ సెకండ్ వేవ్ తొంద‌ర‌గా వ్యాప్తిస్తుంద‌ని తెలిసిన విష‌య‌మే. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ వ‌ద్ద క‌రోనా పై సుదీర్ఘంగా స‌మీక్షించామ‌ని డిప్యూటి సీఎం ఆళ్ల నాని తెలిపారు. సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ … రాష్ట్రంలో కేసుల త‌గ్గించ‌డం, బెడ్‌ల కొర‌త నివారించేందుకు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌ల‌పై సీఎంతో చ‌ర్చించిన‌ట్టు తెలిపారు. అయితే ప్రైవేట్ హాస్పిట‌ల్స్ బెడ్స్‌నుకూడా ఉప‌యోగించుకోవ‌డంతో పాటు ఉద‌యం 6నుంచి 12 గంట‌ల వ‌ర‌కు మాత్ర‌మే క‌ర్వ్యూ అమ‌లుకు చ‌ర్య‌లు తీసుకునే అంశాల‌పై చ‌ర్చించామ‌న్నారు. మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుండి క‌ర్య్వూ అకాశం ఉంద‌న్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ కి ఉన్న ఆక్సిజ‌న్ కొర‌త‌కు పూర్తి స్థాయిలో ఉప‌యోగించుకోవ‌డంపై దృష్టి సారిస్తామ‌ని ఆళ్ల నాని వెల్ల‌డించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *