రాష్ట్రప్ర‌భుత్వాన్నికి చిత్త‌శుద్ధిలేదు! దేవుళ్ల‌కుర‌క్ష‌ణ లేదు…

హైద‌రాబాద్ః రాష్ట్రంలో దేవాల‌యాల‌పై ఇటీవ‌ల కాలంలో దాడులు పెరిగిపోయాయి. ఈ రోజు కూడా రాజ‌మండ్రిలోని సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి విగ్ర‌హంపైదాడి జ‌రిగింది. దేవాల‌యాల‌పై దాడులు జ‌ర‌గ‌డం దుర‌దృష్ట‌క‌రం అని ప్ర‌తిప‌క్ష‌నేత చంద్ర‌బాబు నాయుడు పేర్కొన్నారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో దేవుళ్ల‌కే ర‌క్ష‌ణ లేకుండా పోయింద‌ని, ప్ర‌భుత్వం అల‌స‌త్వం వ‌ల్ల‌నే దాడులు చోటు చేసుకుంటున్నాయ‌ని చంద్ర‌బాబు నాయుడు విమ‌ర్శించారు. క‌న‌క‌దుర్గ‌మ్మ గుడిలో మాయ‌మైన మూడు సింహాల ప్ర‌తిమ‌ల‌ను ఇప్ప‌టి వ‌ర‌క గుర్తించ‌లేద‌ని ,అంత‌ర్వేదిలోర‌థం ‌త‌ల‌బెట్టిన నిందితుల‌ను ఇప్ప‌టికీ అరెస్ట్ చేయ‌లేద‌ని చంద్ర‌బాబు నాయుడు ఆగ్ర‌హాం వ్య‌క్తం చేశారు. వైసీపీ ప్ర‌భుత్వం లో హిందూ సంప్ర‌దాయ‌ల‌కు క‌ళ్లెం ప‌డింద‌ని అన్నారు. దేశంలో ఎక్క‌డా లేని విధంగా ఏపీలో ఆల‌యాల‌పై దాడులు జ‌రుగుతున్నాయ‌ని మాజీ సీఎం పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *