ఏపీ లో ఎన్నిక‌ల ప్ర‌చారం పై నిఘా-ఎస్ఈసీ

హైద‌రాబాద్‌: ఏపీలో అధికారం ప‌క్షం విప‌క్ష‌ల మ‌ధ్య ఎన్నిక‌ల ప్ర‌చారం జోరుగా సాగుతోంది.రెండోరోజు టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు విశాఖ‌లో ప్రచారం నిర్వ‌హిస్తున్నారు.ఏపీ జ‌గ‌న్ స‌ర్కార్ విశాఖ‌ను ఎగ్జిక్యూటివ్ రాజ‌ధానిగా మార్చాల‌ని అనుకుంటున్న త‌రుణంలో జ‌రుగుతున్న మున్సిప‌ల్ ఎన్నిక‌లు రావ‌డంతో విశాఖ ప్ర‌జ‌ల తీర్పు ఎలా ఉండ‌బోతుంది అనే దానిపై ఆస‌క్తి నెల‌కొన్న‌ది. కానీ వైసీపీ జీవీఎంసీలోనే విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌చారం చేస్తున్నారు. విశాఖ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ లో విజ‌యం త‌మ‌దే అని అంటున్నారు. విజ‌య‌సాయిరెడ్డి. ఇక సోము వీర్రాజు నేడు క‌డ‌ప‌లో ప్ర‌చారం చేస్తున్నారు. కానీ ఇదిలా ఉంటే, మున్సిల్ ఎన్నిక‌ల్లో డ‌బ్బు, మ‌ద్యం పంపిణీ పై ఎస్ఈసి నిఘా పెట్టింది. కోడ్ ఉల్లంఘ‌న‌ల‌పై ప‌లు ఫిర్యాదులు వ‌స్తున్నాయ‌ని ఎస్ఈసీ పేర్కొన్న‌ది. విశాఖ‌, విజ‌య‌వాడ ,గుంటూరు, ఉద‌యం 11 గంట‌ల‌కు టెలికాన్ప‌రెన్స్ ను నిర్వ‌హించ‌నున్నారు. ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ రమేష్ కుమార్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *