విద్యార్థుల భ‌విష్య‌త్తు కోస‌మే ఈ క‌ఠిన నిర్ణ‌యాన్ని తీసుకున్నాము….

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో విద్యార్థుల కోస‌మే ప‌దో త‌ర‌గ‌తి , ఇంట‌ర్మీడియ‌ల్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు సీఎం పేర్కొన్నారు. టెన్త్‌, ఇంట‌ర్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించకుంటే వారి భ‌విష్య‌త్తుకే న‌ష్ట‌మ‌ని ఆయ‌న వెల్ల‌డించారు. పరీక్ష‌లు ర‌ద్దు చేయ‌డం చాలా సుల‌భ‌మ‌ని, జాగ్ర‌త్త‌ల‌తో నిర్వ‌హించ‌డ‌మే క‌ష్ట‌మ‌ని చెప్పిన సీఎం విద్యార్థుల కోసం క‌ష్ట‌త‌ర‌మైన మార్గాన్నే ఎంచుకున్నామ‌న్నారు. నేడు ఈ ప‌రీక్ష‌ల నిర్వ‌హిణ‌పై హైకోర్టులో సుదీర్ఘ విచార‌ణ జ‌రుగ‌గా ఈ నేప‌థ్యంగా కోర్టు ప్ర‌భుత్వం పున‌: ప‌రిశీల‌న చేసుకోవాల‌ని సూచించింది. దాదాపు 30ల‌క్ష‌ల మంది విద్యార్థులు, త‌ల్లిదండ్రులు, టీచ‌ర్లు…ప‌రీక్ష‌ల్లో భాగం కావాల్సి ఉంద‌ని, అందుకే పున‌రాలోచించుకోవాల‌ని కోరింది. కేసు విచార‌ణ‌ను హైకోర్టు మే3 తేదీకి వాయిదా వేసిన కోర్టు అదే రోజు ప్ర‌భుత్వ అభిప్రాయం చెప్పాల‌ని ఆదేశిస్తూ మే2 లోపు పూర్తి వివ‌రాల‌తో కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు విచార‌ణ అన‌తంరం సీఎం జ‌గ‌న్ మ‌రోసారి త‌న విధానాన్ని ప్ర‌క‌టించారు. నిన్న‌నే కేర‌ళ‌లో ప‌రీక్ష‌లు పూర్తి చేశార‌ని… పరీక్ష‌లు పెట్ట‌ని రాష్ట్రాల విద్యార్థ‌లకు కేవ‌లం పాస్ మార్కులు మాత్ర‌మే వ‌స్తాయ‌ని..అదే ప‌రీక్ష‌లు నిర్వ‌హించి డెబ్బైశాతం మార్కులు తెచ్చుకుంటే మంచి భ‌విష్య‌త్తు ఉంటుంద‌ని సీఎం జ‌గ‌న్ చెప్పారు. విద్యార్థుల భ‌విష్య‌త్ కోస‌మే ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించుకున్నార‌మ‌ని వెల్ల‌డించారు. ప‌రీక్ష‌ల నిర్వ‌హణ విష‌యంలో కేంద్రం ఎలాంటి విధానం ప్ర‌క‌టించ‌లేద‌ని..రాష్ట్రానికే నిర్ణ‌యాన్ని వ‌దిలేసింద‌ని చెప్పిన సీఎం మ‌న విద్యార్థుల భ‌విష్య‌త్తు కోస‌మే ఈ క‌ఠిన నిర్ణ‌యాన్ని తీసుకున్నామ‌ని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *