స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు గ్రీన్ సిగ్న‌ల్- ఏపీ హైకోర్టు కీల‌క తీర్పు…

అమ‌రావ‌తి: ఇటీవ‌ల కాలంలో జ‌గ‌న్ స‌ర్కార్ వ‌ర్సెస్ రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌గా ప‌రిస్థితులు నెల‌కొన్న సంగ‌తి విదిత‌మే. ఎన్నిక‌ల ఇప్ప‌ట్లో వ‌ద్ద‌ని సీఎం వైఎస్‌జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చెప్ప‌డం.. జ‌రిగి తీరాల్సిందే అన్న‌ట్లుగా ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్‌కుమార్ ఇలా ఇద్ద‌రూ పంతాల‌కు పోయారు. ఈ వ్యవ‌హారం చివ‌రికి కోర్టు దాకా వెళ్ల‌డంతో ఈరోజు రాష్ట్ర అత్యున్న‌త న్యాయ‌స్థానం కీల‌క తీర్పునిచ్చింది. కీల‌క తీర్పు.
గురువారం నేడు స్థానిక ఎన్నిక‌ల‌పై ఏపీ హైకోర్టు కీల‌క తీర్పునిచ్చింది. పంచాయ‌తీ ఎన్నిక‌లు కొన‌సాగించాల‌న హైకోర్టు ధ‌ర్మాస‌నం స్ప‌ష్టం చేసింది. ఎన్నిక‌ల‌పై స్టే విధిస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేయ‌డం జ‌రిగింది. ఎస్ఈసీ దాఖలు చేసిన రిట్ అప్పీల్‌ను హైకోర్టు అనుమ‌తించింది. ఈ
సంద‌ర్భంగా ప్రజారోగ్యం, ఎన్నిక‌లు రెండూ ముఖ్య‌మేన‌ని… ఎవ‌రికీ ఇబ్బంది లేకుండా ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్ర‌భుత్వం, రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ స‌మ‌న్వ‌యంతో ముందుకు సాగాల‌ని హైకోర్టు సూచించింది. కాగా.. ఈనెల 8న ఎన్నిక‌ల షెడ్యూల్‌ను ఎస్ఈసీ ప్ర‌క‌టించింది.11న ఎస్ఈసీ ఆదేశాల‌ను హైకోర్టు సింగిల్ జ‌డ్జి కొట్టేయగా.. ఈ ఆదేశాల‌పై ఎస్ఈసీ అప్పీల్‌కు వెళ్లింది. మూడ్రోజుల పాటు ఇరు ప‌క్షాల వాద‌న‌లు విన్న ధ‌ర్మాస‌నం ఎవ‌రికీ ఇబ్బంది లేకుండా ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని ధ‌ర్మాస‌నం తీర్పునిచ్చింది. ఈ తీర్పును బీజేపీ నేతలు స్వాగ‌తించారు. పంచాయ‌తీ ఎన్నిక‌ల‌కు గ్రీన్‌సిగ్న‌ల్ ఇవ్వ‌డం శుభ ప‌రిణామం అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *