ఓకే బెడ్ పై ఇద్ద‌రు,యువ‌కుడు, మృత‌దేహం

అమ‌రావతి: ఏపీలో రాష్ట్రంలో రోజు రోజు పెట్రేగిపోతున్న క‌రోనా క‌ట్ట‌డికి ఎంతో ప్ర‌య‌త్నించిన లాభం లేకుండాపోయింది,క‌రోనా సెకండ్ వేవ్ విరుచుప‌డుతుంది. ఇలాంటి త‌రుణంలో ప్ర‌భుత్వ ఆస్పుత్రుల్లో బెడ్లు దొర‌క ప్ర‌జ‌లు నానా అవ‌స్థ‌లు ప‌డుతున్నారు.క‌రోనా తీవ్రంగా విరుప‌డ‌టంతో అనంత‌పురం ప్రభుత్వ స‌ర్వ‌జ‌న వైద్య‌శాల‌లోని క‌రోనా విభాగంలో ప‌డ‌క‌ల కొర‌త తీవ్రంగా వేధిస్తోంది. దీంతో ఒకే బెడ్ పై ఇద్ద‌రు రోగుల‌ను ప‌డుకోబెట్టి ప్రాణ‌వాయువు అందిస్తున్నారు. క‌ణేక‌ల్లు మండ‌లానికి చెందిన సుంక‌న్న వృద్ధుడు క‌రోనా లక్ష‌ణాల‌తో ఊపిరాడ‌ని స్థితిలో గురువారం ఉద‌యం ఆసుప‌త్రిలో చేశాడు. ఈయ‌న‌కు ప‌డ‌క లేక ఓ యువ‌కుడు ఉన్న ప‌డ‌క‌పైనే ఆక్సిజ‌న్ పెట్టి చికిత్స అందించారు. కొద్ది గంటల్లో నే ఆ వృద్దుడు మృతిచెందాడు. మృత‌దేహం ఉన్న ప‌డ‌క‌పైనే యువ‌కుడు రెండు గంట‌ల పాటు ఆక్సిజ‌న్‌తో చిక్సిత పొందిన ద‌య‌నీయ ప‌రిస్థితి ఇది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *