అమెరికా ఉపాధ్య‌క్షురాలి తృటిలో తప్పిన ప్ర‌మాదం..

హైద‌రాబాద్: అమెరికా ఉపాధ్యక్షురాలి తృటిలో ప్ర‌మాదం త‌ప్పంది. అమెరికా ఉపాధ్యక్షురాలిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత మొట్ట‌మొద‌టిసారిగా క‌మ‌లాహారిస్‌… నిన్న విదేశీ ప‌ర్య‌ట‌కు ప‌య‌న‌మ‌య్యారు. మేరీల్యాండ్ నుండి గ్వాటెమాల‌కు ఎయిర్ ఫోర్స్‌-2 విమానం బ‌య‌ల్దేరారు. ఈక్ర‌మంలో టేకాఫ్ అయిన నిమిషాల వ్య‌వ‌ధిలోనే …విమానంలో సాంకేతిక స‌మ‌స్య‌లు త‌లెత్తాయి. దీన్ని గుర్తించిన ఫైలెట్లు..వెంట‌నే విమానాన్ని వెన‌క్కి తిప్పారు.తిరిగి మేరీల్యాండ్ లోల్యాండ్ చేశారు.హారిస్ ప్ర‌యాణిస్తున్న విమానం గాల్లో ఉండ‌గానే. సాంకేతిక స‌మ‌స్య త‌లెత్తింది. దీంతో టేకాఫ్ అయిన 25 నిమిషాల‌కే విమానం..వెన‌క్కి తిరిగొచ్చి అత్య‌వ‌స‌రంగా ల్యాండ్ అయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *