రాజ‌ధానిపై – ఆడ‌బిడ్డ‌లు అలుపెరుగని పోరాటం ….

అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో అమ‌రావ‌తి రైతులు అక్కున చేర్చుకున్నార‌న్నారు. టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో రైతులు స్వ‌చ్చందంగా ముందుకు వ‌చ్చి రాజ‌ధాని నిర్మాణం కోసం దాదాపు 33 వేల ఎక‌రాలు ఇచ్చారనికొల్లు ర‌వీంద్ర‌ర‌న్నారు.అమ‌రావ‌తిలో రాజధాని నిర్మానాన్ని తాము స్వాగ‌తిస్తున్నామ‌ని అప్ప‌టి ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న ఇప్ప‌టి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ అసెంబ్లీ సాక్షిగా చెప్పార‌ని ఆయ‌న గుర్తుచేశారు. అమ‌రావ‌తి రాజ‌ధాని కోసం మ‌హిళ రైతులు చేస్తున్న ఉద్య‌మం చ‌రిత్ర‌లో నిలిచిపోతుంద‌న్నారు.రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత రాజ‌ధాని లేకుండా అనాథ మిగిలిన ఏపీ రాష్ట్రంలో అమ‌రావ‌తి రైతులు అక్కున చేర్చుకున్నారు.ఆంధ్ర‌ల క‌ల‌ల రాజ‌ధాని ఊపిరి పోసుకుంటున్న త‌రుణంలో అధికారంలోకి వ‌చ్చిన జ‌గ‌న్ మూడు రాజ‌ధానుల పేరుతో అమ‌రావ‌తిని నిర్వీర్యం చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. రాజ‌ధాని ఇక్క‌డే ఉంటుంద‌ని రైతుల‌ను, రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను ముఖ్య‌మంత్రి న‌మ్మించి మోసం చేశారని హెద్దేవా చేశారు. ముఖ్య‌మంత్రి ప్ర‌క‌ట‌న‌పై రైతులు , ఆడ‌బిడ్డ‌లు అలుపెరుగని పోరాటం చేస్తున్నార‌ని తెలిపారు. రైతుల‌పై అక్ర‌మ కేసులు పెట్టిన‌.. మ‌హిళపై పోలీసుల‌తో దాడి చేయించినా వెన‌క్కి త‌గ్గ‌కుండా ఉద్య‌మాన్ని ముందుకు తీసుకువెళ్తున్నార‌న్నారు. రాష్ట్ర భ‌విష్య‌త్ కోసం అమ‌రావ‌తి రైతులు చేస్తున్న ఉద్యమం త‌ప్ప‌క విజ‌యం సాధిస్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు. మ‌హిళ‌రైతుల ఉద్య‌మానికి రాష్ట్ర ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు ఎప్పుడు ఉంటుంద‌ని కొల్లు ర‌వీంద్ర స్ప‌ష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *