ర‌హానే అద్భ‌తంగా ఆడాడ‌ని దాదా ప్రశంస‌లు…

ముంబైఃబాక్సింగ్ డే టెస్ట్‌లో టీమిండియాకు అద్బుత విజ‌యం సాధించి పెట్టిన కెప్టెన్ అజింక్య‌ర‌హానే పై బీసీసీఐ అధ్య‌క్షుడు సౌర‌వ్‌గంగూలీ ప్ర‌శంస‌లు కురిపించాడు. ఈ విజ‌యం ప్ర‌త్యేకమైనద‌ని అన్నాడు. మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో ఆడ‌టాన్ని టీమిండియా బాగా ఆస్వాదిస్తుంద‌ని,ర‌హానే అద్బుతంగా ఆడాడ‌ని దాదా ట్వీట్ చేశాడు. టీమ్‌కు శుభాకాంక్ష‌లు తెపారు. త‌రువాత రెండు టెస్టుల‌కూ బెస్టాఫ్ ల‌క్ తెలిపాడు. బాక్సింగ్ డే టెస్ట్‌లో 8 వికెట్ల‌తో గెలిచిన టీమిండియా నాలుగు టెస్ట్ల సిరీస్ 1-1తోస‌మం చేసిన సంగ‌తి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో సెంచ‌రీ చేసిన ర‌హానే ఈ విజ‌యంలో కీల‌క‌పాత్ర పోషించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *