రైతుల‌కు ఆర్థిక చేయూత‌….

రైతుల‌కు ఆర్థిక చేయూత అందించాల‌నే ల‌క్ష్యం తో కేంద్రం ఈ ప‌థ‌కాన్ని తీసుకురావ‌డం జ‌రిగింది. ఈపీఎం కిసాన్ స్కీమ్ లో చేరిన వారికి ప్ర‌తి ఏట రూ.6 వేలు వ‌స్తాయి. ఇవి ఒకేసారి కాకుండా మూడు విడ‌త‌ల్లో రూ.2వేలు చొప్పున రైతుల బ్యాంక్ ఖాతాల లోకి చేరుతాయి. అయితే ఇప్ప‌టి దాక చూస్తే..7 విడ‌త‌ల డ‌బ్బు రైతుల‌కు అందింది. ఇక 8 విడ‌త డ‌బ్బులు కూడా ఈ వారంలో వ‌చ్చే ఛాన్స్ వుంది. ఇది ఇలా ఉంటే పీఎం కిసాన్ స్కీమ్‌లో ఉన్న వారికి ప్ర‌తి ఏడాది రూ.36 వేలు పొందే అవ‌కాశం ఉంది. మ‌రి దానికి సంబంధించి పూర్తి గా చూస్తే.. ఈ బెనిఫిట్ పొందాలంటే రైతులు కిసాన్ మాన్‌ధ‌న్ యోజ‌న ప‌థ‌కం లో చేరాలి. మాన్ ధ‌న్ స్కీమ్ లో రైతులు ఈజీగా చేరొచ్చు. దీనితో ప్ర‌తీ ఏడాది రూ.36 వేలు వ‌స్తాయి. 60 సంవ‌త్స‌రాలువ‌చ్చిన త‌రువాత ప్ర‌తి నెలా రూ.3 వేలు ఇస్తారు. అంటే ఏడాదికి రూ.36 వేలు వ‌స్తాయి. ఈ ప‌థ‌కం లోజాయిన్ అవ్వాలంటే రైతులు నెల‌కు రూ.55 నుండి రూ.200 వ‌ర‌కు క‌ట్టాలి. 18సంవ‌త్స‌రాల వ‌య‌సు వారు నెల‌కు రూ.55 క‌ట్టాలి. అదే 40 ఏళ్లు ఉంటే రూ.200 చెల్లించాల్సి ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *