గోల్డ్ ఈసారి 10 గ్రాములు ధ‌ర రూ.65వేల‌కు చేరుతుంది…

హైద‌రాబాద్ః మ‌రోసారి గోల్డ్ గేట్ పీక్స్‌లోకి చేర‌నుందా… లాక్‌డౌన్ త‌రువాత దాదాపు రూ.60 వేల వ‌ర‌కూ చేరేలా క‌నిపించిన గోల్డ్ ఈసారి 10 గ్రాములు ధ‌ర రూ.65వేల‌కు చేరుతుంది. వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ‌తేడాది ఫైనాన్షియ‌ల్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుల‌కు లోన‌య్యాయి. క‌రోనా మ‌హ‌మ్మారి భ‌యాలు పెట్టుబ‌డిదారుల‌ను ఉక్కిరి బిక్కిరి చేయ‌గా, పెట్టుబ‌డుల‌న్నీ బంగారం వైపుకు మ‌ళ్లాయి. బంగారాన్ని పెట్టుబడుల‌కు ర‌క్షితంగా భావిస్తుండ‌ట‌మే కార‌ణంగా మారింది. ప‌సిడి ధ‌ర‌లు ఒక్క‌సారిగా ఊపందుకోవ‌డంతో దేశీయ మార్కెట్‌లో ఏకంగా 2020 లో 10 గ్రాముల పుత్త‌డి మునుపెన్న‌డూ లేనివిధంగా రూ.57వేల‌కు పైగా చేరింది. 2019 ముగింపు ధ‌ర‌తో పోల్చితే 44 శాతం ఎగ‌బాకింది. ఇంట‌ర్నేష‌న‌ల్ మార్కెట్ లో ఒకానొకా దశ‌లో ఔన్సుగోల్డ్ 2వేల 75 డాల‌ర్ల‌కు చేరింది. ఇదే దూకుడు 2021 లోనూ కొన‌సాగ‌వ‌చ్చ‌ని నిపుణులు చెప్తున్నారు. ప‌సిడి సిద్ధం కావ‌డంతో స్టాక్ మార్కెట్లు పెరిగి… గోల్డ్ రేట్లు త‌గ్గుముఖం ప‌ట్టాయి. వ్యాక్సిన్ ప్ర‌భావాన్ని బ‌ట్టి మరింత‌గా దిగిరావ‌చ్చ‌నే అంచ‌నాలు వినిపిస్తున్నాయి.ఈ ఏడాది ధ‌ర‌లు పెరిగే వీలుంద‌న్న అభిప్రాయాలే ఎక్కువ‌గా నిపిస్తుండ‌టం గ‌మ‌నార్హం. బంగారం ప‌ట్ల మ‌దుప‌రుల అభిప్రాయంలో 2020లో తేడా వ‌చ్చిన‌ట్లు స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. ఏటా స్టాక్ మార్కెట్లు పెరిగిన‌ప్పుడు బంగారం ధ‌ర‌లు త‌గ్గ‌ట‌మో లేదా స్థిరంగా ఉండ‌ట‌మో జ‌రుగుతుంది. దీనికి కార‌ణం బంగారం పై పెట్టుబ‌డులు తాత్కాలికంగా కావ‌డ‌మే.స్టాక్ మార్కెట్లు న‌ష్టాల్లో ఉంటే మ‌దుప‌రులు త‌మ పెట్టుబ‌డుల‌ను ప్ర‌త్యామ్నాయ మార్గంగా ప‌సిడివైపు మ‌ర‌లిస్తుంటారు. అందువ‌ల్లే మాత్ర‌ము అలా జ‌ర‌గ‌లేదు. స్టాక్ మార్కెట్లు భారీ న‌ష్టాల్లోఉన్న‌ప్పుడు బంగారంపై పెట్టుబ‌డులు పెరిగి ధ‌ర‌లు ప‌రుగులు పెట్టాయి. స్టాక్ మార్కెట్లు లాభాల్లో క‌ద‌లాడుతున్న‌ప్పుడు బంగారంపై పెట్టుబ‌డులు త‌గ్గినా మునుప‌టి స్థాయిలో దిగ‌లేదు.2020 లో స్టాక్ మార్కెట్‌, బంగారం ధ‌ర‌లు రికార్డుల్లో నిలిచాయి. ఏడాది చివ‌ర్లో బంగారం ధ‌ర రూ.50 వేల ద‌రిదాపుల్లోనిలిచింది. 2019 ముగింపు ధ‌ర‌తో పోల్చితే దాదాపు 25శాతం అధికమే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *