బోల్తా కొట్టించిన పీవీ సింధు ట్వీట్‌….

హైద‌రాబాద్ః బ్యాడ్మీంట‌ల్ క్రీడాకారిణి పీవీ సింధు ట్వీట్‌… మీడియా సంస్థ‌ల‌తో పాటు క్రీడాకారుల‌ను, అభిమానుల‌ను బోల్తా కొట్టించింది. ఆమె ఇవాళ చేసిన ట్వీట్‌ను అంద‌రూ త‌ప్పుగా అర్థం చేసుకున్నారు. విశ్రాంతి, నెగిటివిటీ, భ‌యం నుంచి రిటైర్మెంట్ ప్ర‌క‌టిస్తున్న ట్లు పీవీ సింధు ట్వీట్ చేసింది. మ‌రింత‌క‌ఠినంగా శ్ర‌మించి అద్భుతంగా రాణిస్తాన‌ని ఆమె తెలిసింది. అయితే ఈ విష‌యాన్ని త‌ప్పుగా అర్థం చేసుకున్న మీడియా సంస్థ‌లు ,అభిమానులు… ఆ త‌ర్వాత అస‌లు విషయం తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నా రుడెన్మార్ ఓపెన్ చివ‌రిది. రిటైర్ అవుతున్న‌ట్లు ఉన్న ఆ ట్వీట్‌లో తాను తీసుకున్న నిర్ణ‌యాల గురించి సింధు వివ‌రించింది.బ‌హుశా కొంద‌రికి ఇది గుండెపోటు కావొచ్చేమో.. కానీ అసాధార‌ణ స‌మ‌యాల్లో అసాధార‌ణ నిర్ణ‌యాలు తీసుకోక త‌ప్ప‌లేద‌న్నారు. కోవిడ్ నేప‌థ్యంలో క్రీడా పోటీలు స్తంభించాయ‌ని, ఇలాంటి స‌మ‌యంలో మ‌రింత ఉత్తేజంతో భ‌విష్య‌త్తు కోసం ప్రిపేర్ కావాల్సి ఉన్న‌ట్లు ఆమె త‌న ట్వీట్‌లో వెల్ల‌డించింది. డెన్మార్ ఓపెన్ ఆడ‌లేక‌పోయినా … త‌న క‌ఠోర శ్ర‌మ మాత్రం ఆగ‌ద‌న్న‌ది. ఆసియా క‌ప్‌కు సిద్ధంగా అవుతున్నాన‌ని, పోరాడ‌కుండా దేన్నీ వ‌దిలేది లేద‌ని, క‌రోనా వేళ సుర‌క్షిత‌మైన రోజులు వ‌చ్చేంత వ‌ర‌కు త‌న సాధ‌న నిలిపేదిలేద‌ని సింధు త‌న ట్వీట్‌లో చెప్పింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *