నిరుద్యోగులకు శుభ‌వార్త‌!

తెలంగాణ రాష్ర్టంలో త్వ‌రలోనే నిరుద్యోగుల‌కు శుభ‌వార్త టీచ‌ర్లు, పోలీసుల ఖాళీల‌కు నోటిఫికేష‌న్ వెలువ‌డ‌నుంది. ఉపాధ్యాయ‌, పోలీసు పోస్ట్‌ల‌‌తో పాటు రాష్ర్టంలో ఖాళీగా ఉన్న పోస్టుల‌న్నింటినీ భ‌ర్తీ చేసేందుకు త్వ‌ర‌లోనే నోటిఫికేష‌న్లు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌క‌టించారు. రాష్ర్ట వ్యాప్తంగా అన్ని శాఖ‌ల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివ‌రాలు సేక‌రించాల్సిందిగా ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్ ను సీఎం ఆదేశించారు. రాష్ర్ట‌వ్యాప్తంగా వివిధ శాఖ‌ల్లో దాదాపు 50 వేల వ‌ర‌కు ఖాళీలున్న‌ట్లు ప్రాథ‌మిక స‌మాచారం. వాట‌న్నీంటినీ భ‌ర్తీ చేయాల‌న్నారు. ఈ రెండు విభాగాల‌తో పాటు రాష్ర్టంలోని ఇత‌ర శాఖ‌ల్లో ఉన్న ఖాళీల వివ‌రాలు వెంట‌నే సేక‌రించాల‌న్నారు. ఇంకా ఏఏ శాఖ‌ల్లో ఎంత మంది ఉద్యోగుల అవ‌స‌రం ఉందో లెక్క తేల్చాల‌న్నారు. ఖాళీ పోస్టుల వివ‌రాల సేక‌ర‌ణ అనంత‌రం నోటిఫికేష‌న్లు ఇవ్వాల‌ని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *