బాల‌య్య సినిమాలో యంగ్ హీరో…

టాలీవుడ్ అగ్రహీరో నంద‌మూరి బాల‌కృష్ణ మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో బాల‌య్య‌బాబు హీరోగా రాబోతున్న చిత్రంలో యంగ్ హీరో న‌వీన్ చంద్ర ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడ‌ని గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. కాగా తాజాగా సినీ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం ఈ మూవీలో న‌వీన్ చంద్ర‌ది విల‌న్ క్యారెక్ట‌ర్ అని. ఓమినిస్ట‌ర్ కొడుకుగా న‌టించ‌బోతున్నాడ‌ని తెలుస్తోంది. పూర్తి నెగిటివ్ గ‌డ్స్ ఉన్న క్యారెక్ట‌ర్ అని కూడా తెలుస్తోంది. ఇక నీవిన్ చంద్ర‌,ఎన్టీఆర్ ,అర‌వింద‌స‌మేత మూవీలో న‌టించిన సంగ‌తి తెలిసిందే. కాగా తెలుగు ప్రేక్ష‌కుల్లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన ఈమేజ్ తెచ్చుకున్న న‌వీన్ చంద్ర హీరోగా తెర‌కెక్కిన మూవీ భానుమ‌తి రామ‌కృష్ణ ఈ లాక్‌డౌన్‌లో విడుద‌లై మంచి నేమ్ తెచ్చుకుంది. ఇక బాల‌య్య మూవీలో మెయిన్ విల‌న్‌గా క‌నిపించ‌నున్నాడు. అన్న‌ట్టు ఈ మూవీలో ఓ కొత్త హీరోయిన్‌ను ప‌రిచ‌యం చేయ‌బోతున్నారు. ఈ మూవీన్ని మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి నిర్మించ‌నుండ‌గా త‌మ‌న్ సంగీతం స‌మ‌కూరుస్తున్నారు. త్వ‌ర‌లోనే రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ యాక్ష‌న్ సీక్వెన్స్ ను షూట్ చేయ‌డానికి మేక‌ర్స్ రెడీ అవుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *