నీక‌న్ను నీలి స‌ముద్రం….

టాలీవుడ్ యంగ్ హీరో వైష్ణ‌వ్‌తేజ్‌, కృతిశెట్టి జంట‌గా న‌టిస్తున్నారు. ఉప్పెన మూవీ స‌ముద్రం సాక్షిగా మొద‌లైన ఓజంట ప్ర‌ణ‌య‌క‌థ ఇది.వారి ప్రేమ‌సంద్రంలో ఎలాంటి ఉప్పెన‌లు ఎదుర‌య్యాయో తెలియాలంటే మా మూవీ చూడాల్సిందే. అంటున్నారు.మైత్రీ మూవీ మేక‌ర్స్ సుకుమార్ రైటింగ్స్ ప‌తాకాల‌పై న‌వీన్ యెర్నేని, వై.ర‌విశంక‌ర్ నిర్మిస్తున్నారు. విజ‌య్ సేతుప‌తి కీల‌క పాత్ర‌ధారి. ఈ మూవీలోని నీక‌న్ను నీలి స‌ముద్రం ..పాట యూట్యూబ్ లో 150 మిలియ‌న్ల వ్యూస్ ను సాధించింది. శ్రీ‌మ‌ణి ,ర‌ఖిబ్ ఆల‌మ్ సాహిత్యాన్నందించిన ఈ గీతాన్ని జావెద్ అలీ, శ్రీాకాంత్ చంద్ర ఆల‌పించారు. దేవిశ్రీ‌ప్ర‌సాద్ స్వ‌రాల్ని స‌మ‌కూర్చారు. నిర్మాత‌లు మాట్లాడుతూ న‌వ్య‌మైన ప్రేమక‌థ చిత్ర‌మిది ఓజంట ప్ర‌ణ‌య‌భావాల‌కు అంద‌మైన దృశ్య‌రూపంగా ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *