అమ్మ‌తో కాసేపు గ‌డ‌ప‌డం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది…

హైద‌రాబాద్ః టాలీవుడ్ అగ్ర‌హీరో మెగాస్టార్ చిరంజీవి ఇండ‌స్ట్రీలో త‌న కంటూ ఒక ఇమేజ్ సొంతం చేసుకొని త‌న న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను కొలగొట్టిన స్టార్ మ‌న మెగాస్టారు అంద‌రి తెల‌సిన సంగ‌తే. అమ్మ‌తో నాకున్న అంతా ఇంతా కాదు, అంటూ మెగాస్టార్ చిరంజీవి భావోద్యేగానికి లోన‌య్యారు. న‌టి స‌మంత అక్కినేని వ్యాఖ్యాత‌గా ఆహా ఓటీటీ లోప్ర‌సార‌మ‌వుతున్న సెల‌బ్రిటీ ఛాట్ షో సామ్ జామ్ డిసెంబ‌ర్ 25న క్రిస్మ‌స్ కానుకంగా విడుద‌లైన ఈ మెగా ఎపిపోడ్‌లో చిరంజీవి పాల్గొని ఎన్నో ఆస‌క్తిక‌ర విషయాల‌ను వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించి మెగా ఎపిసోడ్ అన్‌సీన్ పేరుతో ఓవీడియోను విడుద‌ల చేశారు. ఇందులో అన్ని వేళ‌లా అమ్మ‌కు చేదోడువాదోడుగా ఉండేవాడిని ఎంతో కొంత స‌మ‌యం వాళ్ల కోసం కేటాయించండి. అప్పుడు మీకే అర్థం అవుతుంది. వాళ్లు పొందే ఆనందం మాట‌ల్లో చెప్ప‌లేనిద‌ని. తిరిగి ఆ సంతోషం మీకు ఎంతో తృప్తినిస్తుంది. అని చిరంజీవి చెప్పారు.అంతేకాకుండా మీ గుండె లోతుల్లో నుంచి వచ్చే అభిమానానికి నేనెప్ప‌టికీ రుణ‌ప‌డి ఉంటాను మెగాస్టార్ అన్నారు. దోశ ఛాలెంజ్‌లో దోశ‌ను తిరిగేయ‌చ్చు కానీ, అట్ల‌కాడ పెట్ట‌లేదేంటి అని స‌ర‌దాగా న‌వ్వులు పూయించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *