బాల‌య్య మూవీకి ఎప్పుడు ఒక స‌మ‌స్య ఉంటుందాట‌..

టాలీవుడ్ అగ్ర‌హీరో నంద‌మూరి బాల‌య్య ,బోయ‌పాటి శ్రీ‌నుల క‌ల‌యిక‌లో చిత్రం రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉండ‌గా క‌రోనా లాక్ డౌన్ కారణంగా షూటింగ్ ఆగిపోయింది. ఈమూవీ బాల‌య్య‌, బోయ‌పాటిల క‌ల‌యిక‌లో వ‌స్తున్న మూడువ మూవీ. లాక్‌డౌన్ ముగియండంతో మూవీ షూటింగ్ ఇటీవ‌లే మొద‌లైంది. శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. మొద‌టి నుండి ఈ మూవీని రెండు స‌మ‌స్య‌లు వెంటాడుతున్నాయి. వాటిలో ఒక‌టి హీరోయిన్ కాగా ఇంకొక‌టి విల‌న్ . ఈపాత్ర‌ల కోసం న‌టిన‌టుల్ని ఎంపిక చేయ‌డం కోసం చాలానే క‌ష్ట‌ప‌డుతున్నారు. అనేక త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌ల త‌రువాత క‌థానాయిక‌లుగా ప్ర‌గ్యాజైస్వ‌ల్, పూర్ణ‌ల‌ను ఫైన‌ల్ చేశారు. కానీ ఇప్పటికీ విల‌న్ స‌మ‌స్య తీర‌లేదు. బాల‌య్య ను ఢీకొట్ట‌డానికి మొద‌ట్లో బాలీవుడ్ స్టార్ న‌టుడు సంజ‌య్‌ద‌త్ ను అనుకున్నారు. కానీ సంజ‌య్ ఆరోగ్యం డిస్ట‌ర్బ్ కావ‌డం, ఆయ‌న చిక‌త్స కోసం వెళ్ల‌డంతో ఆ ప్లాన్స్ వ‌ర్క‌వుట్ కాలేదు. ట్రీట్మెంట్ పూర్తైనా కూడా ఎక్కువ స్ట్రెస్ తీసుకోకూడ‌ద‌నే ఉద్దేశ్యంతో ఆయ‌న ఎక్కువ మూవీల‌కు సైన్ చెయ్య‌ట్లేదట‌. మ‌రి ఇంతలా వెతుకుతున్న బోయ‌పాటి చివ‌రికి ఎవ‌రిని తీసుకొస్తారో చూడాలి. మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ మూవీన్ని త‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *