వీరిద్ద‌రు క‌లిసి మ‌ళ్లీ న‌టిస్తున్నారంట‌.

టాలీవుడ్ యంగ్ హీరో విజ‌య్‌దేవర‌‌కొండ, ర‌ష్మిక‌మందాన్నా కాంబినేష‌న్‌లో మ‌రో మూవీ వ‌స్తోంద‌ని తెలుగు ఇండ‌స్ట్రీలో చ‌క్క‌ర్లు కొడుతుంది.ఇప్పుడు విజ‌య్‌దేవ‌ర‌కొండ, పూరీ జ‌గ‌న్నాధ్ తో లైగ‌ర్ మూవీలో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు ఈ మూవీ షూటింగ్ ద‌శ‌లో ఉంది. పూరీ ఈ మూవీను పాన్ఇండియా మూవీగా తెర‌కెక్కిస్తున్నాడు. ఈ మూవీ త‌రువాత శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ మూవీ చేయ‌నున్నాడు. ఆ త‌రువాత విజ‌య్‌-సుక్కు మూవీ వ‌చ్చే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఇక ర‌ష్మిక మందాన బాలీవుడ్ మూవీల‌తో బిజీగా ఉన్న‌ది. ఈ మ‌ధ్యే ముంబై కూడా మ‌కాం మార్చిన‌ట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు టాలీవుడ్‌లో అల్లుఅర్జున్ స‌ర‌స‌న పుష్ప మూవీలో న‌టిస్తోంది. ఈ మూవీ త‌రువాత ద‌ర్శ‌కుడు సుకుమార్ త‌న త‌దుప‌రి ప్రాజెక్ట్ లోను మ‌రోసారి ర‌ష్మిక‌తో కలిసి ప‌నిచేయ‌నున్న‌డ‌నే వినిపిస్తోంది. గీతగోవిందం, డియ‌ర్ కామ్రేడ్ మూవీల్లో విజ‌య్‌, ర‌ష్మిక కెమిస్ట్రీ బాగా వ‌ర్కౌట్ అయిన సంగ‌తి తెలిసిందే. సుకుమార్ రెడీ చేస్తున్న స్క్రిప్ట్‌లో మ‌రోసారి వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో వ‌చ్చే అవ‌కాశం ఉంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *