వీరిద్దరి డిన్న‌ర్ డేట్ ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌…..

టాలీవుడ్ యంగ్‌హీరో విజ‌య‌దేవ‌ర‌కొండ‌, రష్మిక మంద‌న్నా గీత గోవిందం మూవీలో క‌లిసి న‌టించిన విష‌యం తెలిసిందే. మ‌రో ఈజంట డియ‌ర్ కామ్రెడ్ మూవీతో మ‌రోసారి ఆక‌ట్టుకున్నారు. దీంతో ఈ మ‌ధ్య విజ‌య్ దేవ‌ర కొండ‌-ర‌ష్మిక జంట‌పై కొన్ని రూమ‌ర్స్ సోష‌ల్ మీడియాను షేక్ చేశాయి. వాళ్ళిద్ద‌రి మ‌ధ్య సీక్రెట్ రిలేష‌న్ షిప్ కొన‌సాగుతుంద‌ని వార్త‌లు వినిపించాయి. న‌టుడు ర‌క్షిత్ శెట్టితో ర‌ష్మిక మంద‌న్న ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ కావ‌డానికి విజ‌య్‌దేవ‌ర‌కొండే కార‌ణం అనే రూమార్లు వినిపిస్తున్నాయి.దీంతో ఈ ఇష్యూజ‌నాల్లో హాట్ టాఫిక్‌గా మారింది. అయితే గుస‌గుస‌లు పెద్ద ప‌ట్టించుకొని ఈ జంట ఎవ‌రి ప్రాజెక్ట్స్‌తో వారి బిజీగా ఉంటున్నారు. విజ‌య్ దేవ‌ర‌కొండ ఇప్పుడు పూరి జ‌గ‌న్నాథ్ డైరెక్ష‌న్‌లో లైగ‌ర్ మూవీ చేస్తున్నాడు. అలాగే ర‌ష్మిక సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పుష్ప మూవీలో న‌టిస్తోంది. కాగా, కొత్త‌గా విజ‌య్‌-ర‌ష్మిక ముంబైలోని ఓ ప్ర‌ముఖ రెస్టారెంట్ వ‌ద్ద కెమెరాకు చిక్కారు. దీంతో
వారి ఎఫైర్ కు సంబంధించిన విష‌యాలు మ‌రోసారి చ‌ర్చ‌ల్లోకి వ‌చ్చాయి. ముంబైలోని ఓస్టార్ హోట‌ల్‌లో డిన్న‌ర్ కు వెళ్లిన ఈజంట .డ్రెస్సింగ్ తోపాటు, ర‌ష్మిక చేతిలో ప్ల‌వ‌ర్ బొకే క‌నిపించ‌డంతో వైర‌ల్‌గా మారారు. అయితే, సిద్ధార్థ్ మ‌ల్హోత్రా హీరోగా న‌టిస్తున్న మిష‌న్‌మ‌జ్ను మూవీతో ర‌ష్మిక బాలీవుడ్‌కు ప‌రిచ‌యం కానుంది. ఈ సంద‌ర్బంగా ఈ బ్యూటీ ముంబై చేరుకుంది. విజ‌య్ దేవ‌ర‌కొండ లైగ‌ర్ షూటింగ్ కూడా ముంబైలోనే జ‌రుగుతుండ‌డంతో ..ఆయ‌న కూడా కొన్ని రోజులుగా అక్క‌డే మ‌కాం వేశారు. షూటింగ్స్‌తో ఇద్ద‌రూ బిజీగా ఉన్నా…. ఇలా ఓకే ప్లేస్‌లో క‌ల‌వ‌డంతో డేట్‌కి వెళ్లార‌నే టాక్ వినిపిస్తోంది.
ఏదైమైనా..వీరి ఫొటో ఇప్పుడు వైర‌ల్ గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *