ఫైట‌ర్ అనేది వ‌ర్కింగ్ టైటిల్‌…

విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ భారీ పాన్ ఇండియా మూవీ రూపొందుతున్న విష‌యం తెలిసిందే. బాలీవుడ్ ప్ర‌ముఖ క‌ర‌ణ్‌జోహార్‌కి చెందిన ధ‌ర్మ ప్రొడ‌క్షన్స్‌,పూరీ క‌నెక్ట్స్ సంస్థ‌లు సంయుక్తంగా ఈ మూవీను నిర్మిస్తున్నాయి. ఈ మూవీకు టైటిల్ ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు. ఫైట‌ర్ అనేది వ‌ర్కింగ్ టైటిల్‌. ఈ మూవీ టైటిల్ ,ఫ‌స్ట్‌లుక్‌నుసోమ‌వారం ఉద‌యం 10.08 గంట‌లకు విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు నిర్మాణ సంస్థ‌లు సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించాయి. భాష‌ల‌కు అతీతంగా అంద‌రినీ అల‌రించేందుకు మూవీ సిద్ద‌మ‌వుతోంది. రేపు ఉద‌యం 10.8 గంట‌లకు టైటిల్ ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల చేస్తామ‌ని పూరీ క‌నెక్ట్స్ సంస్థ పేర్కొంది. బ‌క్సాంగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ మూవీ ప‌లు భాష‌ల్లో విడుద‌ల కాబోతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *