వ‌రుణ్ తేజ్,సాయిప‌ల్ల‌వి జంట‌గా మ‌రోసారి….

టాలీవుడ్ యంగ్ హీరో వ‌రుణ్ తేజ్‌, సాయిప‌ల్ల‌వి కాంబినేష‌న్ లో వ‌చ్చిన మూవీ ఫిదా విష‌యం తెలిసిందే. ఈ మూవీ ప్రేక్ష‌కుల‌కి బాగా న‌చ్చింది. ప్ర‌స్తుతం వీరిద్ద‌రు మ‌రోసారి క‌లిసి అల‌రించేందుకు స‌న్న‌ద్ధ‌మైన‌ట్టు తెలుస్తుంది. ఇప్పుడు వ‌రుణ్ తేజ్ ఎఫ్‌3, గ‌ని మూవీల‌తో బిజీగా ఉండ‌గా, ఈరెండు పూర్త‌య్యాక ఛ‌లో, భిష్మ మూవీల‌తో హిట్ డైరెక్ట‌ర్ గా పేరు తెచ్చుకున్న వెంకీ కుడుముల‌తో ఓ మూవీ చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వ‌ర్క్ కూడా పూర్తైంద‌ని, వీలైనంత తొంద‌ర‌గానే మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లాల‌ని మేక‌ర్స్ ఆలోచిస్తున్నార‌ట‌. అయితే ఈ మూవీకి సంబంధించి మ‌రో ఇంట్రెస్టింగ్ మ్యాట‌ర్ ప్ర‌స్తుతం వైర‌ల‌వుతోంది. మూవీలో వ‌రుణ్ తేజ్ స‌ర‌స‌న ఫిదా ఫేం సాయిప‌ల్ల‌విని ఎంపిక చేసార‌ని, మ‌రోసారి ఈ జంట తెర‌పై పుల్ ఫ‌న్ క్రియేట్ చేయ‌నున్నార‌ని అంటున్నారు. ఈ మూవీన్ని యూవీ క్రియేష‌న్స్ నిర్మించ‌నున్న‌ట్టు స‌మాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *