వ‌కిల్‌సాబ్ బాక్స్‌ఫిస్ వ‌ద్ద వ‌సూళ్ల మోత‌….

టాలీవుడ్ అగ్ర‌హీరో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ న‌టించిన వ‌కీల్‌సాబ్ మూవీ బాక్స్‌ప్సీస్ వ‌ద్ద క‌సుల వ‌ర్షం కురిపిస్తోంది… ఫ‌స్ట్‌డే నుంచి ఓపెనింగ్స్ సాధించిన ఈ మూవీ రెండు, మూడ‌వ రోజు నుంచి వ‌సూళ్లు సాధించింది. సోమవారం కొద్దిగా నెమ్మ‌దించిన ఈ మూవీ మంగ‌ళ‌వారం నుంచి ర‌న్ అందుకుంది. ట్రేడ్ వ‌ర్గాల లెక్క‌ల మేర‌కు ఐద‌వ రోజు మూవీ నైజాంలో 3.04 కోట్లు, సీడెడ్లో 1.78కోట్లు, ఉత్త‌రాంధ్ర‌లో 1.12 కోట్లు, ఈస్ట్ గోదావ‌రిలో 54 ల‌క్ష‌లు, వెస్ట్ గోదావ‌రిలో 34 ల‌క్ష‌లు, గుంటూరు 60ల‌క్ష‌లు, కృష్ణాలో 61 ల‌క్ష‌లు, నెల్లూరు లో 28ల‌క్ష‌లు క‌లిపిమొత్తంగా 8కోట్ల‌కు పైగా షేర్ వ‌సూళు చేసింది. గ‌త నాలుగు రోజుల వ‌సూళ్ళ‌తో క‌లుపుకుంటే మొత్తం షేర్ రూ.65 కోట్ల‌కు చేరింది. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా, క‌ర్ణాట‌క‌, ఓవ‌ర్సీస్ క‌లుపుకుంటే ఆ మొత్తం రూ72 కోట్ల వ‌ర‌కు ఉంది. ప్రీరిలీజ్ బిజినెస్ మేర‌కు మూవీ బ్రేక్ ఈవెట్ టార్గెట్ అందుకోవాలంటే ఇంకో 25 నుండి 30 కోట్లు వ‌సూళు చేయాల్సిఉంది. ఇక ఆర‌వ రోజైనా ఈ బుధ‌వారం సెల‌వు కావ‌డంతో చాలా చోట్ల హౌస్ పుల్ ర‌న్ ద‌క్కించుకుంది. మూవీ ఈ వారం, పైవారం చెప్పుక‌ద‌గిన విడుద‌ల‌లు లేక‌పోవ‌డం మూవీన్ని క‌లిసొచ్చే అంశం. ట్రేడ్ వ‌ర్గాలు ఈ వారం ముగిసేనాటికి మూవీ ఇంకో 17నుండి 20 కోట్ల వ‌ర‌కు రాబ‌ట్ట‌వ‌చ్చ‌ని అంచ‌నా వేస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *