ప‌వ‌న్‌కెరీర్‌లోనే నెవ‌ర్ బిఫోర్- వ‌కీల్‌సాబ్‌

ప్ర‌స్తుతం టాలీవుడ్ అగ్ర‌హీరో మూవీ వ‌స్తుంది అంటే ఆ హంగామా ఎలా ఉంటుందో చెప్ప‌న‌వ‌స‌రం లేదు. మ‌రి అలాంటి స్టార్ హీరోల‌లో ప‌వ‌న్‌క‌ళ్యాణ్ కూడా ఒక‌రు. ప్ర‌స్తుతం ప‌వ‌న్ న‌టించిన తాజా మూవీ అందులోని త‌న కంబ్యాక్ మూవీ వ‌కీల్‌సాబ్ కోసం ప‌వ‌న్ అభిమానులు ఎప్ప‌టి నుంచో ఎంత‌గానో ఎదురు చూస్తున్నారు. నిజానికి ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్న ఈ మూవీ క‌రోనా వ‌ల్ల ఇప్ప‌టికి షిప్ట్ అయ్యింది. కానీ వ‌ప‌న్ కంబ్యాక్ మూవీ అయిన దీనికి అనుకున్న స్థాయి ప్ర‌మోష‌న్స్ లేక‌పోవ‌డం వ‌ల్ల అనుకున్న స్థాయి హైప్ ఇంకా రాలేదు. అన్న‌ది ప‌వ‌న్ అభిమానుల మ‌దిలో ఉన్న మాట కూడా కానీ మేక‌ర్స్ ఇప్పుడిప్పుడే మొద‌లు పెడుతున్నారు. కానీ వ‌కీల్ సాబ్‌కు అస‌లు హైప్ అంతా ఈ మూవీ తాలూకా ప్రీరిలీజ్ ఈవెంట్ తోనే వేరే లెవెల్ కు వెళ్తుంది అని సినీ ఇండ‌స్ట్రీలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ప‌వ‌న్ కెరీర్‌లోనే నెవ‌ర్ బిఫోర్ గా ఈ ప్రీ రిలీజ్ వేడుక‌ను ప్లాన్ చేస్తున్న‌ట్టుగా తెలుస్తుంది. మొత్తానికి దిల్‌రాజ్ మాత్రం అప్ప‌టికి గ‌ట్టిగానే ప్లాన్ చేసిన‌ట్టు ఉన్నార‌ని చెప్పాలి.ఇక ఈ మూవీకి శ్రీ‌రామ్ వేణు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా థ‌మ‌న్ సంగీతం అందించాడు. శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టించిన ఈ మూవీలో అంజ‌లి మ‌రియు నివేతా థామ‌స్ లు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. అలాగే ఈ మూవీన్ని మేక‌ర్స్ వ‌చ్చే ఏప్పిల్ 9న విడుద‌ల చేయ‌నున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *