టైప్ ప్ర‌మోష‌న్ జ‌ర‌గ‌డం ఒకింత ఆశ్చ‌ర్యంగానే ఉంది..

ఇప్పుడు టాలీవుడ్ లెజండ్ హీరో ప‌వ‌న్‌స్టార్ ప‌వ‌న్‌కళ్యాణ్ హీరోగా శృతిహాస‌న్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మూవీ వ‌కీల్‌సాబ్ విష‌యం తెలిసిందే.శ్రీ‌రామ్‌వేణు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించిన లేటెస్ట్ మూవీ వ‌కీల్ సాబ్ విడుద‌లకు రెడీగా ఉన్న విష‌యం తెలిసిందే. మ‌రి ఇక్క‌డ నుంచి వ‌రుస అప్డేట్స్ తోప‌వ‌న్ మిన‌హా మూవీ యూనిట్ కూడా ప్ర‌మోష‌న్స్‌తో హోరెత్తించ‌నుంది. అయితే ప్ర‌స్తుతం ఈ మూవీకి వారి క‌న్నా వేరే ర‌క‌పు ప్ర‌మోష‌న్స్ మొద‌లు అయ్యాయి. ఇవి చూసి ఒకింత ప‌వ‌న్ అభిమానులే ఆశ్చ‌ర్యానికి లోన‌వుతున్నారు. ఇంత‌కీ అదేమిటంటే ఈ మూవీని ప‌లువురుఉత్త‌రాది బీజేపీ నాయ‌కులు కూడా ప్ర‌మోట్ చేస్తున్నారు. ఈ మూవీ భారీ హిట్ అవుతుంద‌ని ఇండ‌స్ట్రీలో గుస‌గుస‌లాడుతున్నారు. ఇటీవ‌ల కాలంలో ఎప్పుడు లేనిది ప‌వ‌న్ మూవీని ప్ర‌స్తుతం ఈ టైప్ ప్ర‌మోష‌న్ జ‌ర‌గ‌డం ఒకింత ఆశ్చ‌ర్యంగానే ఉంది. మ‌రి దీని వెనుక ఆంతర్యం ఏమిటో తెలియాలి. ఇక ఈ మూవీకి థ‌మ‌న్ సంగీతం అందిస్తుండ‌గా దిల్‌రాజు నిర్మాణం వ‌హించిన విష‌యం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *