మంచి ఆఫ‌ర్ ను వ‌దులుకొన్న ఉప్పెన ద‌ర్శ‌కుడు?

ఇప్పుడు మ‌న టాలీవు్ లో డీసెంట్ బ‌జ్‌తో విడుద‌లకు రెడీగా ఉన్న చిత్రాల్లో వైష్ణ‌వ్‌తేజ్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్‌గా న‌టిస్తున్న ఉప్పెన చిత్రం కూడా ఒక‌టి. బిగ్ స్క్రీన్ విడుద‌ల కోస‌మే మంచి ఓటిటి ఆఫ‌ర్స్‌ను వ‌దులుకొన్న ఈ చిత్రం ఇపుడు విడుద‌ల‌కు రెడీ అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఇక ఈ ఇద్ద‌రు హీరో హీరోయిన్స్ కూడా త‌మ నెక్ట్స్ మూవీల‌ను ఓకే చేసేసి వారి ప‌నుల్లో బిజీగా ఉన్నారు.అయితే ఇలాంటి ఫీల్ గుడ్ సినిమాను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు స‌న పేరు కూడా టాలీవుడ్ అండ‌ర్‌లైవ్ చేసి ఉంది. అందుకే ఈ ద‌ర్శ‌కుడికి కూడా మంచి ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయి. అలా వ‌చ్చిన ఓ బ‌డా ఆఫ‌ర్ నేఈ ద‌ర్శ‌కుడు వ‌దుకున్న‌డ‌ని ఇప్పుడు తెలుస్తుంది. మ‌న తెలుగులో ఉన్న ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ల‌లో సితార ఎంట‌ర్టైన్మెంట్స్ కూడా ఒక‌టి. వారు ఈ ద‌ర్శ‌కునికి త‌మ‌తో మూవీ చేయ‌డానికి 60ల‌క్ష‌లు ఆఫ‌ర్ చేశార‌ట‌. కానీ ద‌ర్శ‌కుడు ఈ భారీ ఆఫ‌ర్ వ‌దులుకున్నార‌ట‌. ఎందుకంటే తాను అప్ప‌టికే మైత్రి మూవీ మేక‌ర్స్ వారికి మ‌ళ్లీ ఓకే చేసిన‌ట్టు స‌మాచారం .అయిన‌ప్ప‌టికీ సితార ఎంట‌ర్టైన్మెంట్స్ వారు ట్రైచేసినా తాను మైత్రి మూవీ మేక‌ర్స్ కే అయ్యిఉన్నాడ‌ని తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *