ఉప్పెన మూవీ స‌రికొత్త రికార్డు వంద‌కోట్ల ను క్రియేట్ చేసింది…

క‌రోనా కార‌ణంగా సినీఇండస్ట్రీకి తీరని న‌ష్టం వ‌చ్చింది. సినీకార్మికులు నానా అవ‌స్థలు ప‌డ్డారు తెలిసిన విష‌య‌మే.లాక్‌డౌన్ కార‌ణంగా మూవీ ప‌రిశ్ర‌మ ప‌రిస్థితి ఎలా ఉంటుంద‌ని అంద‌రు ఆందోళ‌న చెందుతున్న స‌మ‌యంలో ఉప్పెన మూవీ అందించిన కాన్పిడెన్స్ అంతా ఇంతా కాదు. మొద‌టి సారి మూవీ తెర‌కు ప‌రిచ‌యం అయిన హీరోవైష్ణ‌వ్‌తేజ్‌,డెబ్యూ హీరోయిన్ కృతిశెట్టి జంట‌గా న‌టించిన మూవీ ఉప్పెన సున్నిత‌మైన ప్రేమ క‌థాంశంగా రూపొందిన మూవీ తొలి రోజు నుండే బ‌క్సాఫీస్ ద‌గ్గ‌ర బంఫ‌ర్ రికార్డు రాబ‌డుతూ అంద‌రు అవాక్కయ్యేలా చేసింది. నాలుగైదు రోజులలోనే ఈమూవీ బ్రేక్ ఈవెన్‌టార్గెట్‌ను క్రాస్ చేసి తాజా రికార్డు క్రియేట్ చేసింది. డెబ్యూ ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు,డెబ్యూహీరో వైష్ణ‌వ్ తేజ్‌, డెబ్యూహీరోయిన్ కృతిశెట్టి క‌లిసి చేసిన మ్యాజిక్ ప్రేక్ష‌కుల‌కు సూప‌ర్ వినోదాన్ని అందించింది. దేవిశ్రీప్ర‌సాద్ అందించిన సంగీతం కూడా మూవీ స‌క్సెస్‌లో భాగ‌మైంది. స‌రికొత్త‌గా ఈ మూవీ వంద కోట్ల గ్రాస్ వ‌సూళ్లు రాబ‌ట్టింద‌ని మేక‌ర్స్ అఫీషియ‌ల్ పోస్ట‌ర్ ద్వారా పేర్కొన్నారు. ఉప్పెనంత ప్రేమ‌కి ధ‌న్య‌వాదాలు అని కామెంట్ పెట్టారు. ఈమూవీలో విజ‌య్ సేతుప‌తి కీల‌క‌పాత్ర‌లో క‌నిపించిన విష‌యం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *