స్టైలిష్ లుక్‌లో ఇద్ద‌రు స్టార్లు..

టాలీవుడ్ త‌న‌కంటూ ప్ర‌త్యేక సంపాంధించిన దిల్‌రాజు నేటితో 50వ వ‌సంతంలోకి అడుగుపెడుతున్న సంగ‌తి తెలిసిందే. దిల్ రాజు ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన పార్టీకి టాలీవుడ్ సినీ ప్ర‌ముఖులు హాజ‌రై పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. దిల్‌రాజు పుట్టిన‌రోజు వేడుక‌లో ప్యాన్ ఇండియ‌స్టార్ హీరోలు య‌శ్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ స్పెష‌ల్ అట్రాక్ష‌న్ గా నిలిచారు. విజ‌య్ స్టైలిష్ డ్రెస్‌లో న‌లుపు రంగు మాస్క్ పెట్టుకుని మెరిసిపోగా.. యశ్ బ్లూ టీష‌ర్టు, జీన్స్‌లో స్టైలిష్ లుక్‌లో క‌నిపించాడు.మ‌రోవైపు హీరోయిన్లు పూజాహెగ్డే, నివేదాపేతురాజ్‌, రాశీఖ‌న్నా, అనుప‌మ‌ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, నితిన్ దంప‌తులు ట్రెండీ లుక్‌లో సంద‌డి చేశారు. ఈస్టార్ హీరోహీరోయిన్ల ఫొటోలు ఇప్పుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి. విజ‌య్ దేవ‌ర‌కొండ ఇప్పుడు పాన్ ఇండియా క‌థాంశంతో వ‌స్తున్న ఫైట‌ర్‌లో న‌టిస్తున్నాడు.పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. మ‌రోవైపు ప్ర‌శాంత్ నీల్ డైరెక్ష‌న్‌లోయ‌శ్ కేజీఎఫ్ చాఫ్ట‌ర్‌2లో న‌టిస్తున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *