పుష్ప మూవీలో ర‌ష్మికా మిడిల్ క్లాస్ అమ్మాయిలా క‌నిపిస్తుందట‌.

టాలీవుడ్ అగ్ర‌హీరో అల్లుఅర్జున్ ,క్రియేటీవ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్ లో వ‌స్తున్న మూవీ పుష్ప విష‌యం తెలిసిందే. ఇందులో హీరోయిన్ గా ర‌ష్మీక‌మందాన్నా న‌టిస్తున్నారు. బిగ్గేస్ట్ మూవీ కావ‌డంతో అంచ‌నాలు భారీగా ఉన్నాయి. పాన్ ఇండియా మూవీ పుష్ప వీరి కాంబో నుంచి ఇదే మొట్ట మొద‌టి పాన్ ఇండియ‌న్ మూవీ కావ‌డంతో దీనిపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. మ‌రి అలాగే ఈ మూవీలో బ‌న్నీ మ‌రియు ర‌ష్మికా రోల్స్ కూడా ఇంత‌కు ముందు ఎప్పుడూ చూడ‌ని విధంగా డిజైన్ చేసిన‌ట్టుగా కూడా విన్నాము. అయితే బ‌న్నీ రోల్ పై కొన్నాళ్ల కిత‌మే మంచి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ బ‌య‌ట‌కు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. కానీ ప్ర‌స్తుతం ర‌ష్మికా రోల్ పై కాస్త క్లారిటీలా క‌నిపిస్తుంది. ఆమె లేటెస్ట్ ఆన్ లొకేష‌న్ ఫొటోలు మ‌రియు వీడియోస్ గ‌మ‌నిస్తే అంత డీగ్లామ‌ర‌స్ లుక్‌లో అయితే క‌నిపించ‌డం లేదు. పైగా ఓ మిడిల్ క్లాస్ అమ్మాయిలా క‌నిపిస్తుంది. మ‌రి ఇలాంటి రోల్ ఉన్న అమ్మాయి ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ చేసే బ‌న్నీ రోల్‌కు ఎలా లింక‌ప్ అయ్యి ఉంటుంది. అన్న‌ది మ‌రో కీల‌క పాయింట్. ఇక ఈ భారీ మూవీన్ని దేవిశ్రీ ప్ర‌సాద్ అవుట్ స్టాండింగ్ పాటలు మ‌రియు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తుండ‌గా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *