వెన్నెల‌కంటి ఇక‌లేరు…

హైద‌రాబాద్ః సినీగేయ ర‌చ‌యిత వెన్నెల‌కంటి క‌న్నుమూశారు. గుండెపోటుతో చెన్నైలోని నివాసంలో ఆయ‌న తుదిశ్వాస విడిచారు. వెన్నెల‌కంటి మృతిప‌ట్ల సినీ ప్ర‌ముఖులు దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. వెన్నెల‌కంటి పూర్తి పేరు వెన్నెల‌కంటి పూర్తి పేరు వెన్నెల‌కంటి రాజేశ్వ‌ర ప్ర‌సాద్‌. ఎస్‌. గోపాల్ రెడ్డి తీసిన ముర‌ళీ కృష్ణుడు(1988) మూవీతో వెన్నెల‌కంటి తెలుగు చిత్ర‌సీమ‌కు గేయ ర‌చ‌యిత‌గా ప‌రిచ‌యం అయ్యారు. ఈ మూవీలో ఆయ‌న రాసిన పాటలు సూప‌ర్ హిట్ అవ‌డంతో వెన్నెల‌కంటికి మంచి పేరు, గుర్తింపు వ‌చ్చింది. మ‌హ‌ర్షి మూవీతో వెన్నెల‌కంటికి గీత ర‌చ‌యిత‌గా గుర్తింపు వ‌చ్చింది. డ‌బ్బింగ్ మూవీల‌కు పాటలు రాయ‌డంతో వెన్నెల‌కంటి ప్ర‌సిద్ధి. అనేక మేటి చిత్రాల్లో ఆయ‌న రాసిన పాట‌లు పాపుల‌ర్ అయ్యాయి. దాదాపు2 వేల పాటలు రాశారు వెన్నెల‌కంటి. ఆదిత్యా369, తీర్పు,క్రిమిన‌ల్,శీను, ట‌క్క‌రిదొంగ‌, మిత్రుడు ,రాజా త‌దిత‌ర మూవీల‌కు ఆయ‌న రాసిన పాటలు అభిమానుల‌ను ఉర్రూత‌లూగించాయి. చెట్టుకింద ప్లీడ‌రు, నాయ‌కుడు, ఔన్ వాళిద్ద‌రూ ఇష్ట‌ప‌డ్డారు. ఏప్రిల్‌1 విడుద‌ల,బృందావ‌నం, స్వాతికిర‌ణం వంటి మూవీలు వెన్నెల‌కంటికి మంచి పేరు తెచ్చాయి. డైలాగ్‌రైట‌ర్ పంచ‌తంత్రం, మొనాలీసా, ద‌శావ‌తారం, ప్రేమ‌ఖైదీ వంటి త‌మిళ మూవీల‌కు తెలుగులో డైలాగులు రాశారు. ఈయ‌న పెద్ద కుమారుడు శ‌శాంక్ వెన్నెల‌కంటి కూడా సినీ డైలాగ్ రైట‌రే. చిన్న కుమారుడు రాకేందు మౌళిలిరిసిస్టుగా, సింగ‌ర్‌గా, న‌టుడిగా రాణిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *