అన్న‌య్య పై ప‌వ‌న్ చేసిన ఈ ఆస‌క్తిక‌ర కామెంట్స్‌…..

ప్ర‌స్తుతం అగ్ర‌హీరో లో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్పుడు త‌న రాజ‌కీయ జీవితాన్ని అలాగే మూవీ కెరీర్ ను కూడా బ్యాలెన్స్ చేస్తూ కొన‌సాగిస్తున్నారు. మూవీ ప‌రంగా తిరుగులేని ఇమేజ్ ను సొంతం చేసుకున్న ప‌వ‌న్ రాజ‌కీయాల్లో పోటీ చేసి ఘోర ప‌రాభ‌వాన్ని చూసారు. ఇప్ప‌టికి త‌న ప్ర‌యాణం మాత్రం ఆప‌లేదు. మార్పే ప‌ర‌మావ‌ధిగా ఇప్పుడు కొన‌సాగుతూ ఇప్పుడు ఏపీలో త‌న మూవీల‌ను బ్రేక్ ఇచ్చిప‌లు ప‌ర్య‌ట‌న‌ల‌లో చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే ఏ విష‌యాన్ని అయినా సూటిగా మాట్లాడే ప‌వ‌న్ నుంచి వ‌చ్చిన ఓ కామెంట్స్ వైర‌ల్ అయ్యాయి. వ‌ప‌న్ కంటే ముందు త‌న అన్న‌య్య మెగాస్టార్ చిరంజీవి కూడా ఏపీ రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. తాను కూడా ఊహించ‌ని ఫ‌లితాన్నే అందుకొనేస‌రికి అవేవి సెట్ట‌వ్వ‌వ‌ని త‌న‌కు ఎంతో అచ్చొచ్చిన మూవీ రంగంలోకే వ‌చ్చేసారు. మ‌రి అలా రాకుండా అన్న‌య్య చిరంజీవి క‌నుక ఇప్ప‌టికీ రాజ‌కీయాల్లో ఉండి ఉంటే ఖ‌చ్చితంగా ముఖ్య‌మంత్రి అయ్యేవారిని, తాను ముఖ్య‌మంత్రి గా ఉంటే ఈరాష్ట్ర ఖ‌చ్చితంగా ఇలా ఉండేది కాదు అని వ్యాఖ్యానించారు. దీనితో అన్న‌య్య‌పై ప‌వ‌న్ చేసిన ఈ ఆస‌క్తిక‌ర కామెంట్స్ మూవీ మ‌రియు రాజ‌కీయ వ‌ర్గాల్లో మంచి వైర‌ల్ అవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *