ఎక్క‌డైతే ఆగిందో అక్క‌డే అదే షెడ్యూల్ మ‌ళ్ళీ ప్రారంభించారు…

ప్ర‌స్తుతం స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్, యంగ్ డైరెక్ట‌ర్ సుకుమార్ క‌ల‌యిక‌లో తెర‌కెక్కుతున్న మూవీ పుష్ప ఈ మూవీ మీద ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలున్నాయి. అలావైకుంఠ‌పురంలో తరువాత బ‌న్నీ చేస్తున్న మూవీ కావ‌డం రంగ‌స్థ‌లం లాంటి భారీ హిట్ త‌రువాత సుకుమార్ చేస్తున్న మూవీ కావ‌డంత హైప్ పెరిగిపోయింది. మూవీ ఎప్పుడేప్పుడు విడుద‌ల‌వుతుందో అని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. అభిమానులు, అయితే అంద‌రి అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేస్తూ కోవిడ్ రూపంలో చిత్రీక‌ర‌ణ‌కు బ్రేకులు ప‌డుతూ వ‌స్తున్నాయి. లాక్‌డౌన్ అనంత‌రం ప‌క్కాగా ప్లాన్ చేసుకొని మారేడుమిల్లి అడ‌వుల్లో చిత్రీక‌ర‌ణ మొద‌లు పెట్టారు. కానీ కొన్ని రోజుల చిత్ర బృందంలో కొంద‌రికి కోవిడ్ పాజిటివ్ రావ‌డంతో ఆ షెడ్యూల్‌ మ‌ధ్య‌లోనే ఆపేసి అంద‌రూ హైద‌రాబాద్ తిరిగొచ్చారు. ప‌ఠాన్ చెరువులో ప్ర‌త్యేక‌మైన ఫారెస్ట్ సెట్ వేసి చిత్రీక‌ర‌ణ జ‌రిపారు. అక్క‌డ షూటింగ్ ముగియ‌డంతో చిత్ర బృందం మ‌ళ్లీ మారేడుమిల్లి అడ‌వుల మీద దృష్టి పెట్టింది. ఎక్క‌డైతే షెడ్యూల్ ఆగిందో అక్క‌డే అదే షెడ్యూల్‌రీస్టార్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. జ‌న‌వ‌రి ఆరంభంలో టీమ్ అక్క‌డ‌కు చేరుకొంద‌ట‌. అయితే ఈ సారి మ‌రిన్ని జాగ్ర‌త్తలుతీసుకుని వీలైనంత త‌క్కువ మంది సిబ్బందితో ప‌నిచేయ‌నున్నార‌ట‌. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో బ‌న్నీ స‌ర‌స‌న ర‌ష్మిక మంద‌న్న క‌థానాయిక‌గా న‌టిస్తోంది. శేషాచ‌లం అడువుల్లో జ‌రిగే ఎర్ర‌చంద‌నం స్మగ్లింగ్ నేప‌థ్యంలో సాగే ఈమూవీలో అల్లు అర్జున్ స్మ‌గ్ల‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ఈ మూవీకి దేవి శ్రీప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *