ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల చేసే వ‌ర‌కు సీక్రెట్‌గా ఉంచుతార‌ట‌…

The ,First, Look, poster ,will ,be, kept ,secret until, it, is, releasedటాలీవుడ్ యంగ్ హీరో నేచుర‌ల్‌స్టార్ నాని ఇప్ప‌టికే వి మూవీతో ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించాడు. ఆయ‌న మొద‌లు పెట్టిన కొత్త ప్రాజెక్ట్ శ్యామ్ సింగ‌రాయ్ ఇంత‌క‌ముందే శివ‌నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో సైన్ చేసిన ట‌క్ జ‌గ‌దీష్ పూర్తిక‌వ‌డంతో ఈ మూవీన్ని ప‌ట్టాలెక్కించారు. ప‌దిరోజుల క్రిత‌మే ప్రారంభోత్స‌వం జ‌రుపుకున్న ఈమూవీ ఈరోజు నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకుంటోంది. 2018లో టాక్సీవాలా మూవీతో ప‌రిచయ‌మైన రాహుల్ సాంకృత్యాన్ ఈ సినిమాకి ద‌ర్శ‌కుడు . ఈ మూవీ కోసం రాహుల్ దాదాపు రెండేళ్లు వెయిట్ చేశారు. ఈ మూవీకి సంబంధించి ఇంత‌కు ముందే ప‌లు పోస్ట‌ర్లు రిలీజ్ చేసిన టీమ్ నాని లుక్ ను మాత్రం రిలీజ్ చేయ‌లేదు. ఇందులో నాని త‌న గ‌త మూవీల్లో కంటే భిన్నంగా క‌నిపిస్తార‌ని తెలుస్తోంది. అందుకే ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల చేసే వ‌ర‌కు సీక్రెట్‌గా ఉంచుతార‌ట‌. ఈరోజు సెట్స్ నుండి ఫోటో రిలీజ్ చేసిన నాని సైతం త‌న లుక్ క‌నిపించ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డ్డారు. ఈ మూవీలో నానికి జోడిగా సాయిప‌ల్ల‌వి, కృతిశెట్టి, మ‌డోన్నా సెబాస్టియ‌న్ న‌టించ‌నున్నారు. మొద‌టిరోజు చిత్రీక‌ర‌ణ‌లో నానితో పాటు కృతిశెట్టి పాల్గొంటోంది. క‌ల‌క‌త్తా నేప‌థ్యంలో ఉండబోతున్న ఈ మూవీన్ని నిహారిక ఎంట‌ర్టైన్మెంట్స్ బ్యాన‌ర్ మీద వెంక‌ట్ ఎస్ బోయ‌న‌ప‌ల్లి నిర్మిస్తున్నారు.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *