కొత్త ప్ర‌య‌త్నానికి శుభ‌రంభం…

శ‌తాధిక మూవీల ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్ర‌రరావు సీనియ‌ర్ హీరోల‌ దగ్గ‌ర నుండి ఈ కాలం కుర్ర హీరోల వ‌ర‌కు ఎన్నో అద్భుత‌మైన మూవీలు చేశారు. ద‌ర్శ‌కుడిగా రాఘ‌వేంద్ర‌రావు ప్ర‌స్థానం అనిర్వ‌చ‌నీయం. అయితే ఇప్పుడు ఆయ‌న కొత్త జ‌ర్నీని మొద‌లు పెట్టేందుకు సిద్ధ‌మ‌య్యారు. స్టేజ్‌ల‌పై మాట్లాడ‌డానికి కూడా ఇష్ట‌ప‌డ‌ని రాఘ‌వేంద్ర‌రావు 78ఏళ్ల వ‌య‌స్సులో త‌న‌లోని న‌టుడిని బ‌య‌ట‌కు సుకురానున్నార‌ట‌. రాఘ‌వేంద్ర‌రావుని న‌టుడిగా త‌నికెళ్ల భ‌ర‌ణి ప‌రిచ‌యం చేయ‌నుండగా, ఇందులో స‌మంత‌, శ్రియ‌శ‌ర‌ణ్‌, ర‌మ్య‌కృష్ణ‌, స‌మంత అక్కినేని కీల‌క పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు. అయితే రాఘ‌వేంద్ర‌రావు సినిమా గురించి గొప్ప ప్ర‌క‌ట‌న చేయాల‌నుకుంటున్నాం. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో ఈ మూవీకి సంబంధించి అఫీషియ‌ల్ అనౌన్స్ మెంట్ చేయ‌నున్నాం అని త‌నికెళ్ల భ‌ర‌ణి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *