తేజూ ఏదో స‌ర‌దాగా అని ఉంటాడు….

టాలీవుడ్ అగ్ర‌హీరో చిరంజీవి సోద‌రుడు అయిన నాగాబాబు త‌న కూతురు నిహారిక పెళ్లి అయిన కొద్ది రోజుల‌కే సాయిధ‌ర‌మ్‌తేజ్ మెగా కుటుంబంలో మ‌రో పెళ్లి వేడుక జ‌ర‌గ‌నుందంటూ శుభ‌వార్త అందించాడు. సోలో బ్ర‌తుకే సోబెట‌ర్ మూవీ ప్ర‌మోష‌న్‌లో పాల్గొన్న స‌మ‌యంలో త‌న వివాహం ప్ర‌స్తావ‌న రాగా, దీనిపై స్పందించిన సాయిధ‌ర‌మ్ తేజ్ ,శిరీష్ నాకంటే పెద్ద‌వాడు. వ‌చ్చే సంవ‌త్స‌రం త‌న పెళ్లి జ‌ర‌గ‌వ‌చ్చు. నేను పెళ్లి చేసుకునేందుకు ఇంకా స‌మ‌యం ఉంది. నాకు కొన్ని బాధ్య‌తులు ఉన్నాయి. వాటిని పెళ్లికి ముందే పూర్తి చేయాలి. అని తెలిపారు.ఈ వార్త బ‌య‌ట‌కు రాగానే మెగా అభిమానులు శిరీష్‌ని పెళ్లి ఎప్పుడు అంటూ అడ‌గ‌డం మొద‌లు పెట్టారు. ఈ క్ర‌మంలో త‌న ట్విట్ట‌ర్ ద్వారా స్పందించాడు. శిరీష్… హ హ‌హ‌.. తేజూ ఏదో స‌ర‌దాగా చెప్పి ఉంటాడు. మీరు దానిని సీరియ‌స్‌గా తీసుకున్నారు. పెళ్లి గురించి మా కుటుంబం న‌న్ను ఒత్తిడి చేయ‌డం లేదు. పెళ్లి చేసుకోవాలి అనుకున్న‌ప్పుడు త‌ప్ప‌క చెబుతాను అంటూ శిరీష్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *