త‌మిళ స్టార్ విజ‌య్ అట్లీ కాంబినేష‌న్‌లో మ‌రోసారి……

త‌మిళ‌నాట స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న విజ‌య్ ఫెవ‌రెట్ ద‌ర్శ‌కుల్లో యువ ద‌ర్శ‌కుడు అట్లీ ఒక‌రు. వీరిద్ద‌రిదీ సూప‌ర్ హిట్ కాంబినేష‌న్‌. మొద‌టి మూవీ రాజా రాణి త‌రువాత అట్లీ వ‌రుస‌గా మూడు చిత్రాలను విజ‌య్ తోనే చేశారు. తేరి,మెర్స‌ల్, బిగిల్‌, మూడు మూవీలు సూప‌ర్ హిట్లుగా నిలిచాయి. అందుకే వీరిది సూప‌ర్ హిట్ కాంబినేష‌న్‌. వీరి మూవీ వ‌స్తుందంటే అభిమానుల్లో అంచ‌నాలు భారీగా ఉంటాయి. అట్లీ, విజ‌య్ ఇద్ద‌రు కూడా ఎప్ప‌టిక‌ప్పుడు త‌మ క‌ల‌యిక‌లో త‌రువాత చిత్రంను ప్లాన్ చేసుకుంటూనే ఉంటారు. ఈ నేప‌థ్యంలో తాజాగా విజ‌య్ అట్లీ కార్యాల‌యానికి వెళ్లి ఆయ‌న్ను వ్య‌క్తిగ‌తంగా క‌ల‌వ‌డం త‌మిళ సినీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. వీరిద్ద‌రూ క‌ల‌వ‌డంతో కొత్త మూవీ ఏదైనా ప్లాన్ చేస్తున్నారా. విజ‌య్ త‌రువాతి మూవీ అట్లీతోనేనా అనే అనుమానాలు మొద‌ల‌య్యాయి. ప్ర‌స్తుతం విజ‌య్ మాస్ట‌ర్ మూవీ విడుద‌ల స‌న్నాహాల్లో ఉన్నారు. త‌రువాతి మూవీన్ని నెల్స‌న్ దిలీప్‌క‌మార్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తారనే టాక్ కూడా ఉంది. మ‌రోవైపు అట్లీ షారుఖ్ ఖాన్ మూవీకోసం స‌న్న ద్ద‌మ‌తున్నారు. దీన్నిబ‌ట్టి ఈ మూవీలు పూర్త‌య్యాక ఇద్ద‌రూ క‌లిసి ప‌నిచేయ‌డానికి అవ‌కాశాలు లేక‌పోలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *