కొత్త మూవీ కోసం బ‌రువు త‌గ్గే ప‌నిలో ఉన్న‌ట్లు టాక్..

ప్ర‌స్తుతం టాలీవుడ్ లో ఉన్న అగ్ర‌హీరోలో ప‌వన్‌క‌ళ్యాణ్ కూడా ఒక‌రు.ప‌వ‌న్ అంటే భారీ అభిమానుల‌లో పాలోయింగ్ విప‌రితంగా ఉంటుంది. ఆయ‌నకు మంచి క్రేజ్ కూడా ఉంది. ఇప్పుడంటే పాలిటిక్స్ లోకి వెళ్లి కొన్ని క్లిష్ట‌మైన ప‌రిస్థితుల‌ను ఎదుర్కొన్నా త‌న క్రేజ్ మాత్రం చెక్కు చెద‌ర‌లేదు. దీనితో మూవీలు ప‌రంగా క‌ళ్యాణ్ ఎక్కువ దృష్టి పెట్ట‌లేక‌పోయారు. మ‌ళ్లీ సినిమాల‌ను టేక‌ప్ చేసారు కానీ అందుకు త‌గ్గ‌ట్టుగా లుక్స్ మైంటెన్ చేయ‌ట్లేద‌ని అభిమానుల్లో కూడా ఎక్క‌డో చిన్న వెలితి కూడా ఉంది. దీనితో ఒక‌ప్ప‌టి ప‌వ‌న్ ను వారు బాగా మిస్స‌య్యిన‌ట్టు అయ్యింది. కానీ ఇప్పుడు ప‌వ‌న్ చాలా బ్యాలెన్సుడ్‌గా పాలిటిక్స్ మ‌రియు మూవీల‌ను చేసేస్తున్నారు. ఒక‌దాంట్లో ఉంటూనే మ‌రోదానిపై కూడా దృష్టి పెడుతున్నార‌ట‌.అలా ఇప్పుడు త‌న బ‌రువు త‌గ్గే ప‌నిలో ఉన్నార‌ని ఓ టాక్ వ‌ర్గాల్లో చ‌క్క‌ర్లు కొడుతుంది. అందుకు ఆ లుక్స్ లోనే ఎక్కువ‌గా కోరుకునే వారు ఉన్నారు. కానీ ప‌వ‌న్ నుంచి అది అయ్యే ప‌నికాదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *