సూర్య బోయ‌పాటి కాంబినేష‌న్‌లో మూవీ…

టాలీవుడ్ లో మ‌రియు కోలీవుడ్‌లో అగ్ర‌హీరో అయిన సూర్య సూర్య‌కున్న అభిమానుల ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. త‌మిళంతోపాటు తెలుగులోనూ చాలా మంది ఫ్యాన్ ఫాలోవ‌ర్స్ సంపాదించుకున్నాడు. అయితే ఈస్టార్ యాక్ట‌ర్ ఇప్ప‌టివ‌ర‌కు స్ట్రెయిట్ తెలుగు మూవీలో న‌టించ‌లేదు. తెలుగులో మూవీ చేసేందుకు స‌రైన డైరెక్ట‌ర్ కోసం ఎదురుచూస్తున్న సూర్య కోసం బోయ‌పాటి శ్రీ‌ను యాక్ష‌న్ ప్యాక్‌డ్ స్క్రిప్ట్ రెడీ చేశాడ‌ని ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల్లో టాక్ వినిపిస్తోంది. బోయ‌పాటి ఈ క‌థ‌ను తొలుత ప్ర‌భాస్ కోసం సిద్ధం చేసుకోగా. ప్ర‌స్తుతం సూర్య చేతుల్లోకి ఈప్రాజెక్టు తీసుకెళ్లాల‌ని ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలుస్తొంది. ఇప్పుడు బోయ‌పాటి, బాల‌కృష్ణ‌తో ఓ మూవీ చేస్తున్న విష‌యం తెలిసిందే. బాల‌య్య మూవీ విడుద‌లైన త‌రువాత వ‌చ్చిన ఫ‌లితాన్ని బ‌ట్టి సూర్య డైరెక్ట‌ర్ బోయ‌పాటితో మూవీను అనౌన్స్ చేస్తాడేమోనంటూ ఊహ‌గానాలు వెల్లువెత్తుతున్నాయి. సూర్య‌తో తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఈ మూవీన్ని
తెర‌కెక్కించాల‌నుకుంటున్నాడ‌ట బోయ‌పాటి. మ‌రి ఈ క్రేజీ కాంబినేష‌న్‌లో తెర‌పైకి వ‌స్తుందా? లేదా అనేది తెలియాలంటే మ‌రికొంత కాలం వెయిట్ చేయాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *