సూర్య,ధ‌నుష్ మూవీలు అరుదైన ఘ‌న‌తను సొంతం చేసుకున్నాయి..

ప్ర‌స్తుతం త‌మిళ సినీ ఇండ్ర‌స్టీ నుండి కొన్ని మంచి మూవీలు వ‌చ్చాయి. ఇవి కేవ‌లం త‌మిళ ప్రేక్ష‌కుల‌నే కాకుండా ఇత‌ర భాష‌ల ప్రేక్ష‌కుల్ని కూడా అల‌రించాయి. వాటిలో ధ‌నుష్ న‌టించిన అసుర‌న్ సూర్యచేసిన ,సూర‌రైపొట్రు చిత్రాలున్నాయి. ఈ మంచి విజ‌యాల‌ను అందుకున్న ఈ మూవీలు తాజాగా మ‌రోక ఘ‌న‌త‌ను సొంతం చేసుకున్నాయి. ఈరెండు మూవీల‌ను 78వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ వేడుక‌ల్లో ప్ర‌ద‌ర్శించ‌నున్నారు. లాస్ ఏంజిల్స్ నందు జ‌న‌వరిలో ఈ వేడుక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఉత్త‌మ విదేశీ మూవీల కేట‌గిరీలో కొలివుడ్ ప‌రిశ్ర‌మ త‌ర‌పున ఇవి ఎంపిక‌య్య‌యి. ధ‌నుష్ హీరోగా న‌టించిన అసుర‌న్‌, మూవీని వెట్రి మార‌న్ డైర‌క్ట్ చేశారు. గ‌త సంవ‌త్స‌రం విడుద‌లైన ఈ మూవీ ధ‌నుష్ కెరీర్లోనే ఉత్త‌మ మూవీగా నిలిచింది. దీన్ని తెలుగులో వెంక‌టేస్ ,నార‌ప్ప పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఇక సూర్య చేసిన సూర‌రై పొట్రు మూవీ ఇటీవ‌లే అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుద‌లై మంచి మూవీగా పేరు తెచ్చుకుంది. సుధాకొంగ‌ర ఈ మూవీని ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. తెలుగులో కూడా ఆకాశం నీ హ‌ద్దురా పేరుతో విడుద‌లై ప్రేక్ష‌కుల్ని బాగా ఆక‌ట్టుకుంది. ఈ రెండు మూవీలు మంచి మూవీ అనే పేరుతో పాటు క‌మ‌ర్షియ‌ల్‌గా కూడా విజ‌యాన్ని సాధించాయి. ఈ రెండింటికీ జీవీ ప్ర‌కాష్ సంగీతం అంద‌జేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *