చిన్ని గుండెకుఊపిరి పోసిన సూప‌ర్ స్టార్‌..

టాలీవుడ్ అగ్ర‌హీరో మ‌హేష్ బాబు చేస్తున్న మూవీ స‌ర్కార్ వారిపాట చేస్తూ విష‌యం తెలిసిందే. ఆన్ స్క్రీన్ రీల్ హీరో అయితే ఆఫ్ స్క్రీన్‌లో రియ‌ల్ హీరో అని చెప్ప‌డంలో ఎలాంటి సందేహామూ లేదు. త‌న సంపాద‌న‌లో ఇప్ప‌టికే చాలా మేర సొసైటిటీకి ఖ‌ర్చు చేసారు. అలా ఇప్ప‌టికే ఎన్నో వేలాది చిట్టి గుండెల‌కు ఊపిరి పోసిన మ‌హేష్‌బాబు నేడు క్రిస్మ‌స్ పండుగ‌కు మ‌రో చిన్ని గుండెకు ఊపిరి పోసి త‌ల్లిందడ్రుల‌కు పండుగ కానుక‌గా అందించారు. ఏపీలోని ఉమా కుటుంబానికి చెందిన బిడ్డ‌కు స‌ర్జ‌రీ చికిత్స చేయ‌డం ద్వారా ఆ బిడ్డ బ‌త‌క‌డంతో మ‌హేష్ భార్య న‌మ్ర‌త సోష‌ల్ మీడియా ద్వారా షేర్ చేసుకొని త‌న ఆనందం వ్య‌క్తం చేశారు. అలాగే ఆంధ్ర ఆసుప‌త్రి వారికి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేయ‌డ‌మే కాకుండా ఆ చిన్నారి త‌ల్లిదండ్రులు కూడా బాగుండాలని ఆకాంక్షించారు. ఒక‌ప‌క్క అభిమానుల కోసం మూవీల‌ను స‌మాజం కోసం ఇలా స‌హాయం చేస్తూ మహేష్ రియ‌ల్ హీరోగా నిలిచారు అని చెప్పాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *