నిన్న‌టికంటే మెరుగ్గా ర‌జనీకాంత్ ఆరోగ్యం – అపోలో వైద్యులు

కోలీవుడ్ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ శుక్ర‌వారం హై బీపీతో హైద‌రాబాద్ లోని అపోల్ ఆసుప‌త్రిలో అడ్మిన్ అయిన విష‌యం తెలిసిందే. ఇంట‌ర్నేష‌న‌ల్ షూట్‌లోని ప్ర‌త్యేక రూమ్ లో ర‌జ‌నీకాంత్‌కు వైద్య సేవ‌లు అందిస్తున్నారు. తాజాగా ర‌జ‌నీకాంత్ ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ బులిటెన్ విడుద‌ల చేశారు. అపోలో వైద్యులు ,హెల్త్ బులిటెన్‌లో ర‌జ‌నీకాంత్ ఆరోగ్యం నిన్న‌టి కంటే మెరుగ్గా ఉంద‌ని పేర్కొన్నారు. ర‌జ‌నీకాంత్‌కు ఈరోజు మ‌రికొన్ని వైద్య ప‌రీక్ష‌లు చేయాల్సి ఉండ‌గా, వాటికి సంబంధించిన రిపోర్ట్స్ సాయంత్రం వ‌ర‌కు రానున్నాయి. అని అపోలో వైద్యులు తెలిపారు. ఇప్పుడు ర‌క్త‌పోటు హెచ్చుత‌గ్గుల‌కు సంబంధించి చికిత్స అందిస్తున్నాం. పూర్తిగా విశ్రాంతి తీసుకోవాల‌ని ఆయ‌న‌కు సూచించాం ద‌య‌చేసి ఆసుప‌త్రి వ‌ద్ద‌కు ఎవ‌రు రావొద్ద‌ని మ‌రోసారి విజ్ఞ‌ప్తి చేస్తున్నాం. అంటూ అపోలో వైద్యులు హెల్త్ బులిటెన్‌లో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *