సునీల్ శెట్టి,బాల‌య్య మూవీలో క‌నిపిస్తున్నాడ‌ట‌..

Sunil Shetty, is, appearing, in, a ,childhood movie టాలీవుడ్ అగ్ర హీరో నంద‌మూరి న‌ట‌సింహాం బాల‌య్య‌మ‌రియు బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో రానున్న చిత్రంలో బాలీవుడ్ న‌టుడు సునీల్‌శెట్టి న‌టించ‌బోతున్నాడ‌ని తెలుస్తుంది. ఈ భారీ యాక్ష‌న్ మూవీలో సీనియ‌ర్ బాల‌య్య‌కు విలన్ పాత్ర ఉంద‌ని.. ఈ పాత్ర‌లో సునీల్‌శెట్టిను తీసుకోవాలని అనుకుంటున్నార‌ట‌. అయితే సీనియ‌ర్ బాల‌య్య క్యారెక్ట‌ర్ కేవ‌లం రెండు సీన్స్ లో మాత్ర‌మే ఉంటాడ‌ని… ఆ క్యారెక్ట‌ర్‌కి విలన్‌గా ప్లాష్ బ్యాక్ లో సునీల్‌శెట్టి క‌నిపిస్తున్నాడ‌ని తెలుస్తోంది. మ‌రి సునీల్ శెట్టి,బాల‌య్య మూవీలో ఏ లుక్స్‌లో క‌నిపించ‌బోతున్నాడో.. ఎలాంటి పాత్ర చేయ‌బోతున్నాడో చూడాలి. ఇక బాల‌య్య యంగ్ క్యారెక్ట‌ర్‌కి హీరోయిన్ ఫిక్స్ చేయ‌కుండానే క‌రోనాకి ముందు ఈ మూవీకి సంబంధించిన ఒక యాక్ష‌న్ షెడ్యూల్‌ని కూడా ఫినిష్ చేశారు. త్వ‌ర‌లోజ‌రిగే షూట్లో కూడా హీరోయిన్ పార్ట్‌కు సంబంధించిన సీన్స్‌ను లేకుండా బోయ‌పాటి షూట్ ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. ఏమైనా బాల‌య్య హీరోయిన్ స‌మ‌స్య ప్ర‌తి మూవీన్ని ఉంటూ వ‌స్తోంది. ఈ మూవీ కోసం బాల‌య్య అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *