సుకుమార్ మ‌రో 15 ల‌క్ష‌లు ఆక్సిజ‌న్ ప్లాంట్ కోసం….

టాలీవుడ్ ద‌ర్శ‌కుడు సుకుమార్ నేను అంటూ ఆక్సిజ‌న్ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకు వ‌చ్చారు. కొవిడ్ విజృభిస్తున్న త‌రుణంలో సినీ ప్ర‌ముఖులు త‌మ‌వంతు సాయం అందిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఆక్సిజ‌న్ కొర‌త తీర్చేందుకు ప్ర‌తి జిల్లాలోఆక్సిజ‌న్ బ్యాంకులు పెట్ట‌నున్న‌ట్లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. దీని కోసం ఇప్ప‌టికే సుకుమార్ రూ.10ల‌క్ష‌లు అధికారుల‌కు అంద‌జేశారు. మొత్తం రూ.25లక్ష‌లు అందిస్తాన‌ని చెప్పారు. అయితే… దానికి అద‌నంగా మ‌రో రూ.15లక్ష‌లు ఇచ్చేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఈ మేర‌కు తూర్పు గోదావ‌రి జిల్లాలోని సుకుమార్ స్వ‌స్థ‌ల‌మైన రాజోలులో రూ.40లక్ష‌ల వ్య‌యంతో ఆక్సిజ‌న్ ప్లాంట్ నిర్మాణం కానుంది. త‌క్ష‌ణ‌మే ఈ ప్లాంటు నిర్మాణం చేప‌ట్టి నాలుగు రోజుల్లో పూర్తి చేసేలా క‌స‌ర‌త్తు చేస్తున్నారు. సుకుమార్ గ‌త సంవ‌త్స‌రం సైతం కోవిడ్‌పై పోరుకు త‌మ‌వంతు సాయంగా రూ.10ల‌క్ష‌లు విరాళ‌మిచ్చారు. కొత్త‌గా కోన‌సీమ‌లో ఆయ‌న ఏర్పాటు చేయిస్తున్న ఈ ప్లాంట్ క‌రోనాతో బాధ‌ప‌డుతూ ఆక్సిజ‌న్ కోసం ఎదురుచూస్తున్న వారికి దోహ‌దం చేయ‌నుంది. ఈ ప్లాంట్ నిర్మాణంపై జిల్లా ప్ర‌జ‌లు సుకుమార్ కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *