పుష్ప కోసం కూడా రంగ‌స్థ‌లం ఫాలో అవుతున్నాడు….

టాలీవుడ్ అగ్ర‌హీరో స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మూవీ పుష్ప ,రెడ్ శాండిల్ స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతుంది. దాంతో ఈ మూవీలో షూటింగ్ పార్ట్ అధిక భాగం అడవుల‌లో చిత్రీక‌రించాలీ. అయితే ,లాంగ్ అండ్ ఎస్టాబ్లిష్ మెంట్ షాట్స్ అడవుల్లోకి వెళ్లి తీస్తున్నా. కొన్ని క్లోజ్‌షాట్స్ అండ్ ఇన్ డోర్ సీన్స్ మాత్రం హైద‌రాబాద్ లోనే తియ‌బోతున్నారు. అందుకు కోకాపేట ఏరియాలో సెట్ నిర్మాణం చేప‌ట్టార‌ని తెలుస్తోంది. సుకుమార్ రంగ‌స్థ‌లం మూవీకి కూడా ఇలాగే సెట్ వేయించి షూట్ చేశారు. ప్ర‌స్తుతం పుష్ప కోసం కూడా రంగ‌స్థ‌లంనే ఫాలో అవుతున్నాడు సుకుమార్‌. ఇక వ‌చ్చే షెడ్యూల్‌లో బ‌న్నీ-ర‌ష్మిక పై సాంగ్ షూట్ చేయ‌నున్నారు. అన్న‌ట్టు ఈ మూవీలో ఓ స్పెష‌ల్ సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీ ఊర్వ‌శి రౌటెలాను ఫైన‌ల్ చేసింది చిత్ర‌బృందం. అలాగే ఈ మూవీలో పోలీస్ ఆఫీస‌ర్ క్యారెక్ట‌ర్ ఉంది. ఆ క్యారెక్ట‌ర్ కోసం మంచి హీరోను వెతుకుతుంది టీమ్ . ఇక మూవీలో బ‌న్నీకి జోడిగా వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న ర‌ష్మిక మంద‌న్న క‌థానాయిక‌గా న‌టించ‌నుండ‌గా దేవిశ్రీ‌ప్ర‌సాద్ సంగీతం అందించ‌నున్నారు. మైత్రి మూవీ మేక‌ర్స్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *