స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టిస్తూ అద‌ర‌గొట్టింది-ర‌కుల్ ప్రీత్ సింగ్

టాలీవుడ్ హీరోయిన్ ర‌కుల్‌ప్రీత్ సింగ్ కెర‌టం మూవీతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైనా ర‌కుల్ ప్రీత్‌.. సందీప్‌కిష‌న్ వెంక‌ట్రాది ఎక్స్‌ప్రెస్ మూవీతో తెలుగులో తొలి విజ‌యాన్ని అందుకుంది. ఈ మూవీ విడుద‌లై ఏడేళ్లు అవుతోంది. ఈ సంద‌ర్భంగా త‌న తొలి విజ‌యాన్ని గుర్తు చేసుకున్నారు. ర‌కుల్ ప్రీత్‌సింగ్ ఏడేళ్ల క్రితం ఇదే రోజు న‌వ్వుతూ ఉన్నాను. ఇప్పుడూ అదే న‌వ్వునా మొహం మీద ఉంది. దీనంత‌టికీ కార‌ణం న‌న్ను ఎంతో ప్రేమ‌తో ఆద‌రించిన‌, అభిమానించిన ప్రేక్ష‌కుల వ‌ల్లే..ఎక్క‌డో ఢిల్లీ అమ్మాయిగా ఈ ప్ర‌యాణం అద్భుతంగా సాగుతోంది. ఈ నా సినీ జ‌ర్నిలోన‌న్ను ఓ యార్ట‌ర్‌గా న‌మ్మిన ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు, యాక్ట‌ర్స్‌, ఫ్రెండ్స్ అంద‌రికీ నా హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు. ఈ క్ర‌మంలో నేను ఇంకా మంచి న‌టిగా, మ‌నిషిగా మార‌డానికి మీ స‌ల‌హాలు, సూచ‌న‌లు, విమ‌ర్శ‌లు కూడా ఎంతో ఉప‌యోగ‌ప‌డ్డాయి. ఇదంత‌టి కార‌ణం నా కుటుంబం, నాటీమ్. వీరే లేక‌పోతే ఇది సాధ్య‌మ‌య్యేదే కాద‌ని పేర్కొంది. ఇక ర‌కుల్ సినిమాల విష‌యానికి వ‌స్తే.. త‌న అందంతో వ‌రుస‌గా అవ‌కాశాలు ద‌క్కించుకుంటూ
స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టిస్తూ అద‌ర‌గొట్టింది. అందులో భాగంగా లౌక్యం నాన్న‌కు ప్రేమ‌తో ధృవ వంటి హిట్ మూవీల‌ను త‌న ఖాతాలో వేసుకుంది ర‌కుల్ .ఆ మ‌ధ్య ఈ భామ ఎడా పెడా న‌టించిన కొన్ని మూవీలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర త‌స్సుమ‌న‌డంతో అవ‌కాశాలు త‌గ్గాయి. దీంతో ర‌కుల్ ప్రీత్ సింగ్ పాత్ర‌ల ఎంపిక‌లో ఆచితూచి అడుగులు వేస్తుంది. ఇక ఇటీవ‌ల బాలీవుడ్ డ్ర‌గ్ కేసులో ర‌కుల్‌ను అధికారులు ప్ర‌శ్నించిన సంగ‌తి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *