బుడ‌త‌డు భీమ్‌గా క‌నిపిస్తాడా…? సీతారామ రాజుగా క‌నిపిస్తాడా ?

ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు టాలీవుడ్ సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ ఎస్ ఎస్ రాజమౌళి. రామ్‌చ‌ర‌ణ్ అల్లూరి సీతారామరాజుగా న‌టిస్తుండ‌గా.. కొమ్రం భీం పాత్ర‌లో ఎన్టీఆర్ న‌టిస్తున్నాడు. రామోజీఫిలిం సిటీలో ప్ర‌ధాన భాగం షూటింగ్ జ‌రుపుకుంటోంది. ధృవ‌న్‌వ‌న్ ఆఫ్‌ది లీడ్ రోల్ చేస్తున్నాడు. ధృవ‌న్ ఫేస్‌బుక్ పేజీలో అత‌ని లుక్ ఒక‌టి పోస్ట్ చేసి.. అత‌డు ఆర్ ఆర్ ఆర్ లో భాగం.. క్యాప్ష‌న్ ఇచ్చాడు. ఈ ఫొటో ప్ర‌స్తుతం నెట్టింట్లో వైర‌ల్ అవుతుంది. అయితే ఈ బుడ‌త‌డు భీమ్‌గా క‌నిపిస్తాడా…? సీతారామ రాజుగా క‌నిపిస్తాడా అన్న‌ది మాత్రం చెప్ప‌లేదు. స్టిల్ ను చూసిన నెటిజ‌న్లు మాత్రం ఈ లుక్ ఖ‌చ్చితంగా జూనియ‌ర్ భీమ్ దేనంటూ కన్పామ్ చేస్తున్నారు. ఈ ఫొటో చూస్తుంటే రాజ‌మౌళి ఆర్ ఆర్ ఆర్ మూవీలో కొమ్రం భీమ్‌, అల్లూరి చిన్న‌నాటి పాత్ర‌ల‌ను కూడా చూపించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఈ మూవీ స్టోరీ 160 నిమిషాల‌పాటు తెలుస్తోంది. ఈ మూవీలో అలియాభ‌ట్‌, ఒలివియామొర్రిస్‌, అజ‌య్‌దేవ్‌గ‌న్‌, స‌ముద్ర‌ఖ‌ని ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఎం ఎం కీరవాణి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్పై డీవీవీ దాన‌య్య ఈ మూవీన్ని నిర్మిస్తున్నారు. 2021 అక్టోబ‌ర్ 13న విడుద‌ల కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *