పేద ప్ర‌జ‌ల‌కు సాయం చేసేందుకు సోనూసూద్ త‌న ఆస్తుల‌ను మార్టిగేజ్ పెట్టాడ‌ట‌.

బాలీవుడ్ న‌టుడు సోనూసూద్ లాక్‌డౌన్ స‌మ‌యంలో విప‌త్క‌ర ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటున్న వారికి నేనున్నానంటూ అండ‌గా నిలిచాడు. సోనూసూద్. వేలాది మంది నిరాశ్ర‌యుల‌ను స్వ‌స్థ‌లాల‌కు చేర్చ‌డ‌మే కాకుండా వారి అవ‌స‌రాల‌ను ద‌గ్గ‌రుండి తీర్చాడు. క‌నీస్ అవ‌స‌రాల‌ను తీర్చుకోలేని ప‌రిస్థితుల్లో ఉన్న వారికి అన్నీ తానై స‌మ‌కూర్చి రియ‌ల్ హీరో అనిపించుకున్నాడు. సోనూసూద్ గొప్ప మ‌న‌సుకు దేశ వ్యాప్తంగా ప్ర‌జ‌లంతా నీరాజ‌నాలు ప‌లికారు. పేద ప్ర‌జ‌ల‌కు విద్య‌ను అందించేందుకు స‌హ‌కరించ‌డంతోపాటు ఉపాధి కూడా క‌ల్పించాడు. ప్ర‌తీసారి ఏదో ఒక సాయం చేస్తూ ముందుకెళ్తున్నాడు. సోనూసూద్ ఇదంతా తాను సొంతంగా సంపాదించిన డ‌బ్బుతోచేయ‌డం విశేషం. పేద ప్ర‌జ‌ల‌కు సాయం చేసేందుకు సోనూసూద్‌త‌న ఆస్తుల‌ను మార్టిగేజ్ పెట్టాడ‌ట‌. త‌న పేరు మీద భార్య పేరుపై ముంబైలో ఉన్న రూ.10 కోట్ల విలువైన 6 ప్లాట్ల‌ను, రెండు షాపుల‌ను మార్టిగేజ్‌లో పెట్టిన‌ట్టు తాజాగా న్యూస్ ఒక‌టి బీటౌట్ లో చక్క‌ర్లు కొడుతోంది. సాయం చేయాల‌నే గొప్ప మ‌న‌సుంటే ఎలాగైనా సాయం చేయొచ్చ‌ని నిరూపిస్తున్నాడు. సోనూసూద్ .ఎన్ని క‌ష్టాలు ప‌డుతూనైనా పేద ప్ర‌జ‌ల‌కు సాయం చేస్తున్న సోనూసూద్ కు హ్యాట్సాప్ చెప్పాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *